Site icon NTV Telugu

Bengaluru Stampede: తొక్కిసలాట ఘటనలో సంచలన విషయాలు.. ముందే ప్రభుత్వానికి లేఖ రాసిన డీసీపీ..!

Bengaluru Stampede

Bengaluru Stampede

బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసంది. జూన్ 4న, డీసీపీ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. “ఆర్సీబీకి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. లక్షలాది మంది వేడుకకు రావొచ్చు. భద్రతా సిబ్బంది కొరత ఉంది. అభిమానుల భారీగా తరలి వస్తే అనుకోని ఘటనలు జరగవచ్చు. ప్రజా ప్రవేశ పాస్‌లను రద్దు చేయాలి. విధానసౌధ ప్రాంగణంలో సీసీటీవీ నిఘా అసంపూర్ణంగా ఉంది. దీనివల్ల భద్రతా సమస్యలు తలెత్తవచ్చు.” అని ముందుగానే పరిపాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి జి. సత్యవతికి రాసిన లేఖలో హెచ్చరంచారు.

READ MORE: Rajasthan: అశోక్‌ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య కీలక భేటీ.. ఆనందంలో రాజస్థాన్ కాంగ్రెస్

పీడబ్ల్యుడీ రెండు గంటల ముందుగానే వేదికను తనిఖీ చేసి, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి అని డీసీపీ పేర్కొన్నారు. విద్యుత్ పరికరాలకు ప్రత్యేక ఫిట్‌నెస్ సర్టిఫికేట్ గురించి కూడా ప్రస్తావించారు. ట్రాఫిక్, శాంతిభద్రతల మధ్య సమన్వయం లోపాన్ని డీసీపీ లేఖలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇతర జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను పిలిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. డీసీపీ లేఖ రాసినప్పటికీ.. ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు. ఫలితంగా, బెంగళూరు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

READ MORE: Rajasthan: అశోక్‌ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య కీలక భేటీ.. ఆనందంలో రాజస్థాన్ కాంగ్రెస్

Exit mobile version