Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bengaluru Man Books Bike Ride On Uber Discovers Former Google Employee Behind The Wheel

Viral News: ఊబ‌ర్ డ్రైవ‌ర్‌గా మారిన టెక్కీ.. ఎందుకో తెలిస్తే షాకే..!

Published Date :October 25, 2023 , 10:17 pm
By Sudhakar Ravula
Viral News: ఊబ‌ర్ డ్రైవ‌ర్‌గా మారిన టెక్కీ.. ఎందుకో తెలిస్తే షాకే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Viral News: ఓ టెక్కీ ఊబర్‌ మెటో డ్రైవర్‌గా మారిపోయాడు.. ఇది టెక్కీల సందడి దండిగా కనిపించే బెంగళూర్‌ సిటీలో.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అంటేనే లక్షల్లో జీతాలు.. అలాంటి వాడు అసలు ఊబర్‌ డ్రైవర్‌గా ఎందుకు మారుడు అనే విషయాన్ని తెలుసుకుంటే నోరువెల్లబెట్టాల్సిందే.. ఇంతకీ.. బెంగ‌ళూర్‌లో వెలుగు చూసిన ఆ టెక్కీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఊబర్ మోటో డ్రైవ‌ర్ గూగుల్ మాజీ ఉద్యోగి అని తెలియ‌డంతో ఓ వ్యక్తి ఆశ్చర్యానికి లోన‌య్యాడు. రాఘ‌వ్ దువా అనే వ్యక్తి త‌నకు ఎదురైన అనుభ‌వాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు.. దీంతో.. పలువురు నెటిజన్లు త‌మ‌కు ఎదురైన అలాంటి అనుభ‌వాల పంచుకోవడంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది..

అయితే, త‌మ బైక్‌-ట్యాక్సీ డ్రైవ‌ర్‌కు టెక్నిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు బెంగ‌ళూర్ వ్యక్తి గుర్తించ‌డం ఇదే మొదటిసారి కాదట.. రాఘ‌వ్ దువా అనే నెటిజన్‌ వెల్లడించిన ప్రకారం.. ఇటీవ‌ల బెంగ‌ళూర్‌కు వెళ్లాడు.. సిటీ చూసేందుకు ఊబ‌ర్ బైక్‌ను బుక్ చేసుకున్నాడు.. ఆపై త‌న డ్రైవ‌ర్ గూగుల్ మాజీ ఉద్యోగి అని గుర్తించి షాక్‌ తిన్నాడు.. అతడు ఈ మధ్యే బెంగ‌ళూర్‌కు వచ్చినట్టు తెలుసుకున్నాడు.. అతడు ఊబర్‌ డ్రైవర్‌గా ఎందుకు మారాడు? అనే విషయాలపై ఆరా తీశాడు.. న‌గ‌రంలో విస్తృతంగా తిరిగేందుకు తాను డ్రైవర్‌గా మారిపోయాయనని.. హైద‌రాబాద్ నుంచి 20 రోజుల కింద‌టే బెంగ‌ళూరు వచ్చానని.. సిటీ మొత్తం చూసేద్దాం అనే ఈ పని ఎంచుకున్నట్టు చెప్పాడంటూ రాఘ‌వ్ దువా సోషల్‌ మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నాడు..

“నా ఉబర్ మోటో డ్రైవర్ ఎక్స్-గూగుల్ ఉద్యోగి.. హైదరాబాద్ నుండి 20 రోజుల క్రితం బెంగుళూరుకు వచ్చాడు.. అతను కేవలం నగరాన్ని అన్వేషించడానికే ఇలా చేస్తున్నాడు” అని పేర్కొంటూ.. ట్విట్టర్‌లో కామెంట్‌ చేస్తూ దువా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.. X వినియోగదారులు వారి స్వంత ‘పీక్ బెంగళూరు’ క్షణాలను పంచుకోవడంతో, పోస్ట్ త్వరగా దృష్టిని ఆకర్షించింది, ఇక్కడ సాధారణ అనుభవాలు అసాధారణమైన అనుభూతిని కలిగి ఉంటాయి. ఈ సంఘటన కొత్త చర్చకు దారి తీసింది.. ఒక వ్యక్తి తమ మనోగతాన్ని వ్యక్తం చేయడంతో, ఇది నిజంగా మనోహరమైనది! మీ రైడ్ సమయంలో మీరు ఆసక్తికరమైన సంభాషణను కలిగి ఉన్నారని నేను ఆశిస్తున్నాను!” మరొక వినియోగదారు తమ స్వంత అనుభవాన్ని పంచుకున్నారు.. ఇక, మూడో వ్యక్తి హాస్యభరితంగా “బెంగళూరులో, మీరు గాలిలో రాయి విసిరితే, అది పక్షిని లేదా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తాకుతుంది” అని చమత్కరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengaluru
  • Bike Ride
  • former Google employee
  • platform X
  • Raghav Dua

తాజావార్తలు

  • Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!

  • Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

  • PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం

  • Coconut Rice: సమయం తక్కువ, రుచి ఎక్కువ.. పిల్లలు ఇష్టంగా తినే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీ కోసం..

  • Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions