ఆటో డ్రైవర్లు అరకొర రాబడితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈఎంఐలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతుంటారు. పొద్దంతా ఆటో నడిపినా వెయ్యి రూపాయలు రావడం కూడా కష్టమే అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆటో డ్రైవర్ మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ ఐటీ ఉద్యోగులు సైతం ఈర్ష్య పడేలా సంపాదిస్తున్నాడు. ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ఆటో డ్రైవర్ తన ఆదాయం గురించి చెప్పడంతో షాక్ కు గురయ్యాడు. ఈ విషయాన్నంతా ఎక్స్ లో పంచుకున్నాడు.
Also Read:Georgia Protests 2025: జార్జియాలో నిరసనలకు రష్యాకు సంబంధం ఏంటి?.. ఆ దేశంలో ఏం జరుగుతుంది!
బెంగళూరులో ఒక సాధారణ ఆటోరిక్షా ప్రయాణం ఇంజనీర్ ఆకాష్ ఆనందానికి కళ్ళు తెరిపించేలా చేసింది. అక్టోబర్ 4న, ఆకాశ్ ఆనందాని ఒక ఆటో ఎక్కాడు. ఆ ఆటో డ్రైవర్ ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లను వాడుతున్నట్లు గుర్తించాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ తో మాట్లాడడం ప్రారంభించానని చెప్పాడు. రూ. 4-5 కోట్ల విలువైన రెండు ఇళ్లకు ఓనర్ నని, నెలవారీ అద్దె ఆదాయం రూ. 2-3 లక్షలు, అదనంగా AI స్టార్టప్‌లో వాటాలు కలిగి ఉన్నానని ఆటో డ్రైవర్ చెప్పినట్లు తెలిపాడు. అతను వారాంతాల్లో డ్రైవ్ చేస్తాడని, దానిని తన మొదటి ఉద్యోగంగా భావిస్తాడని ఆకాశ్ తెలిపాడు.
“ఆటో వాలా భయ్యా తనకు 4-5 కోట్ల విలువైన 2 ఇళ్ళు ఉన్నాయని, అద్దెకు నెలకు 2-3 లక్షల వరకు సంపాదిస్తున్నానని, AI ఆధారిత స్టార్టప్ బ్రూలో స్టార్టప్ వ్యవస్థాపకుడు / పెట్టుబడిదారుడని చెప్పాడు” అని ఆనందాని X లో ఒక పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. నెటిజన్స్ స్పందిస్తూ.. “బెంగళూరు స్టార్టప్ రాజధాని కావడానికి ఇదే కారణం – ఆటో డ్రైవర్లు కూడా పెట్టుబడిదారులే!” అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు “ఇది బాలీవుడ్ సినిమా నుండి వచ్చిన స్క్రిప్ట్ లాగా ఉంది” అని చమత్కరించారు. అయితే, ఆనందాని ఆ కథ నిజమేనని నొక్కి చెప్పాడు.
Bangalore is fucking crazy the auto wala bhaiya said he has 2 houses worth 4-5 crs 😭 both on rent earns close to 2-3 lakhs per month , and is a startup founder / investor in a ai based startup bruh 😭😭😭
— Akash Anandani (@Kashh56) October 4, 2025
