Site icon NTV Telugu

Man Kills Wife: కాళ్లు చేతులు కట్టి గొంతుకోసి భార్య హత్య.. ఆపై రైలు కింద దూకి..

Man Kills Wife

Man Kills Wife

Man Kills Wife: ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతిర్పారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారిక వర్గాల ప్రకారం.. బహిరంగ మైదానంలో మహిళ మృతదేహం కనుగొనబడింది, ఆమె భర్త మృతదేహాన్ని ఆ మైదానం సమీపంలో రైలు పట్టాలపై స్వాధీనం చేసుకున్నారు. మృతులను జయంత్ సర్దార్, భార్య దీపాలి సర్దార్‌గా గుర్తించారు. దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుటుంబ కలహాల కారణంగా దంపతులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీపాలి తన తండ్రితో కలిసి జీవించింది. దంపతుల మధ్య గొడవలు పెరగడంతో కోర్టును ఆశ్రయించి విడాకుల పిటిషన్‌ దాఖలు చేశారు. దంపతులు అప్పుడప్పుడు కలుసుకునేవారు. శుక్రవారం రాత్రి జయంత్ దీపాలిని కలవాలని పిలిచాడు. శనివారం ఉదయం చేతులు, కాళ్లు కట్టివేయబడిన స్థితిలో దీపాలి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. ఘటనాస్థలికి చేరుకున్న కృష్ణగంజ్ పోలీసులకు సమాచారం అందించారు. దీపాలి మృతదేహం ఉన్న మైదానానికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై జయంత్ మృతదేహం లభ్యమైంది.

Read Also: Bungee Jumping : బంగీ జంప్ చేశాడు.. బురదలో పడ్డాడు.. లేకుంటే మనోడి పని?

కజ్లీ సర్దార్ అనే స్థానికుడు మాట్లాడుతూ.. దంపతులు ఎప్పుడూ గొడవ పడుతుండేవారని.. కోర్టులో కేసు నడుస్తుంటే అప్పుడప్పుడు కలిసేవారని.. దీపాలిని కలవాలని జయంత్‌ రాత్రి ఫోన్‌ చేశాడని చెప్పాడు. దీపాలి తల్లి మాట్లాడుతూ.. “రాత్రి 11 గంటల ప్రాంతంలో దీపాలిని కలవాలని జయంత్ ఫోన్ చేసాడు. ఆ సమయంలో ఆమె నిద్రలో ఉంది, కానీ జయంత్‌ ఆమెను కలవాలని పట్టుబట్టాడు. ఆమె అతనిని కలవడానికి వెళ్ళింది, కానీ ఆమె ఇంటికి తిరిగి రాలేదు, మాకు అనుమానం పెరిగింది. శనివారం ఉదయం దీపాలి హత్యకు గురైందని, పదునైన ఆయుధంతో హత్య చేశారని మాకు తెలిసింది.’ అని ఆమె చెప్పారు. మరో స్థానికుడు తపన్ సర్దార్ మాట్లాడుతూ, “జయంత్ ఆమె చేతులు, కాళ్ళు కట్టి చంపి ఆపై రైలు ముందు దూకి ఉండాలి. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నేలపై రక్తపు మడుగులో పడి ఉన్న దీపాలి మృతదేహాన్ని చూశాము. భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరిగినా, జయంత్ ఆమెను చంపేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు.’ అని తెలిపాడు. ఈ విషయమై కృష్ణగంజ్ పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Exit mobile version