Bengal Governor: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గవర్నర్ లైంగిక వేధింపుల అంశం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, రాజ్‌భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో గురువారం బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ ను చూపించారు. గత నెల 24న, ఈ నెల 2వ తేదీన తనపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు కాంట్రాక్టు మహిళా సిబ్బంది గత శుక్రవారం కోల్‌కతా పోలీసులకు రాతపూర్వక కంప్లైంట్ చేసింది.
Read Also: Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
ఇక, ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి రాజకీయ నాయకులకు, పోలీసులకు మినహాయించి సాధారణ పౌరులందరికీ చూపిస్తానంటూ గవర్నర్ బోస్ బుధవారం చెప్పారు. అయితే, దాదాపు గంటన్నరసేపు ఉన్న సీసీ ఫుటేజీలో మహిళ నీలం రంగు జీన్స్, టాప్‌తో రాజ్‌భవన్ ప్రాంగణంలోని పోలీస్ అవుట్ పోస్టు వైపు వెళ్తున్నట్లు అందులో కనిపించింది. కాగా, సీసీటీవీ ఫుటేజీ చూడటానికి దాదాపు 92 మంది ఆసక్తి కనబరిచినా.. కొందరు మాత్రమే హాజరయ్యారు. ఈ సంఘటనపై ప్రజలే ఒక నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రిలీజ్ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సీసీ ఫుటేజీని చూసిన వారిలో ఒకరైన ప్రొఫెసర్ తుషార్ కాంతి ముఖర్జీ.. మహిళ ప్రవర్తనలో ఎక్కడా అసాధారణత కనిపించలేదన్నారు.
Read Also: Sam Curran: చాలా బాధగా ఉంది.. మమల్ని క్షమించండి: సామ్ కరన్
అయితే, ఈ వీడియోను రాజ్ భవన్ విడుదల చేయడంపై బాధిత మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తనతో పాటు తన కుటుంబం పరువు పోయిందని ఫిర్యాదు చేసిన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా నా వీడియోను గవర్నర్ విడుదల చేశారంటూ మండిపడింది. దీంతో నా ప్రాణాలు తీసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కరెక్టుగా విచారణ జరిపితే, నిజం బయటపడుతుంది అని ఆమె కోరారు.