Bengal Governor: ఈ నెల 26న సీఎం సమక్షంలో బెంగాల్ గవర్నర్‌కు అక్షరాభ్యాసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Governor: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌కు ఈ నెల 26న అక్షరాభ్యాసం జరగనుంది!. ఈ వయస్సులో ఆయనకు అక్షరాభ్యాసం ఏంటని ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆశ్చర్యకరమైనా అది నిజమేనండోయ్..! ఈ నెల 26న సరస్వతీ పూజను పురస్కరించుకుని మమతా బెనర్జీ సమక్షంలో రాజ్‌భవన్‌లో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం పలక, బలపం పట్టి గవర్నర్ బెంగాలీ అక్షరాలు దిద్దుతారు. రాజ్‌భవన్‌లో ఆనందబోస్‌కు ఈ క్రతువు జరగనుంది.
ఆంగ్లం, హిందీ, మలయాళం భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనందబోస్ బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలని ఆసక్తితో ఉన్నారు. బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఆయన తన ఆసక్తిని వెలిబుచ్చారు. ఇందుకోసం బెంగాలీ భాష నేర్చుకోవాలని నిర్ణయించారు. బెంగాలీ భాషలోని అక్షరాలను నేర్చుకునే ముందు భాగంగా చిన్నారులకు ‘హతేఖోరీ’ పేరుతో నిర్వహించే సంప్రదాయ రీతిలో అక్షరాభ్యాస తంతును గవర్నర్‌కు నిర్వహిస్తారు.
Also Read
Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉంది.. అలా చేస్తేనే అంతం!
ఇదిలా ఉండగా.. మాజీ ఐఏఎస్ అధికారి అయిన సీవీ ఆనందబోస్ మలయాళీ.. కాగా ఆయన ఎన్నో భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన తండ్రి వాసుదేవన్ నాయర్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఎనలేని గౌరవం. అందుకే, తన పిల్లలందరి పేర్లకూ చివర బోస్ అనే పేరు పెట్టారు.
తాజావార్తలు
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..