NTV Telugu Site icon

Lady Fingers : అమ్మాయిలూ.. నానబెట్టిన బెండకాయ నీటితో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

Okra Water

Okra Water

బెండకాయలో మన శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక అంశాలు ఉన్నాయి. బెండకాయ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే బెండకాయ నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనలో చాలా మందికి రక్తహీనత అనే వ్యాధి వలన రక్తంలోని హిమోగ్లోబిన్‌ శాతం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వారు నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకోవడం వలన రెడ్‌ సెల్స్‌ పుష్కలంగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా శరీరంలో తగినంత హిమోగ్లోబిన్‌ శాతం ఉత్పత్తి అవుతుంది. బెండకాయ వాటర్‌ దగ్గు, గొంతు నొప్పులు తగ్గించేందుకు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడే గొంతు నొప్పి, గొంతు వాపు, దగ్గు, గొంతులో దురద వంటి సమస్యలను బెండకాయలు ఉండే యాంటీసెప్టిక్‌ లక్షణాలు సమర్థవంతంగా ఎదుర్కొంటారు.

Also Read : Rahul Gandhi: ఆప్ లేకుంటేనా.. గుజరాత్‌లో బీజేపీని ఓడించే వాళ్లం

ఈ మధ్య కాలంలో చక్కెర వ్యాధి బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బెండకాయలో ఇన్సులెన్‌ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి చక్కెర వ్యాధి నియంత్రించడానికి ఎంతగానో తోడ్పడతాయి. నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకోవటం వలన రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ కూడా తగ్గించుకోవచ్చు. అతిసారాన్ని నియంత్రించడంలో కూడా ఈ వాటర్‌ ఎంతగానో సహాయపడుతుంది. అతిసారం వలన శరీరంలో నుంచి నీరు అధికంగా బయటికి పోతుంది. అందువల్ల శరీరం డీ హైడ్రేషన్‌ బారిన పడుతుంది. నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం ద్వారా సమస్య నుండి తేలికగా బయటపడవచ్చు.

బెండకాయలో నీటిలో కరిగే ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. తద్వారా గుండెపోటు వంటి సమస్యలు నివారించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. బెండకాయ రక్త స్థాయిలను కూడా క్రమబద్దీకరణ ఇస్తుంది.

Also Read : Dragon Fruit : ఆ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే డ్రాగన్‌ ఫ్రూట్‌ తినండి..!

మలబద్ధకం అనేది సాధారణంగా కనిపించే సమస్య అయినా పరిష్కారం లేకపోతే మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. బెండకాయలు ఉండే ఫైబర్ సమస్య ఒక చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకోవడం వలన ఇది ప్రేగులో కదలికలు ఏర్పరిచి సాఫీగా మలవిసర్జన అయ్యేలా చూస్తుంది. బెండకాయ మన శరీరంలో రోగనిరోధక శక్తిని రెట్టింపు చేసే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇందులో ఉండే విటమిన్ సి అనేక వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్‌ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. బెండకాయలో ఆస్తమా దాడిని తగ్గించే అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే బెండకాయలను ఆహారంగా తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే గర్భిణి మహిళలు బెండకాయలు ఆహారంలో తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఎముకలు దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి.

Show comments