Site icon NTV Telugu

ENG vs NED: బెన్‌స్టోక్స్‌ వీరోచితం.. నెదర్లాండ్స్ లక్ష్యం 340 పరుగులు

Eng Vs Ned

Eng Vs Ned

ENG vs NED: ప్రపంచకప్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌అసోసియేషన్‌ స్టేడియంలో ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌కు 340 పరుగులు భారీ లక్ష్యాన్ని అందించింది. బెన్‌స్టోక్స్(108) సెంచరీతో, క్రిస్‌ వోక్స్(51) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌ భారీ స్కోరు చేయగలిగింది. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెన్‌స్టోక్స్ ఒంటి చేత్తో జట్టుకు భారీ స్కోరును అందించడంలో సాయపడ్డాడు.

Also Read: ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన భారత్.. అగ్రస్థానంలో గిల్, సిరాజ్

ఆస్ట్రేలియా తరఫున ముంబైలో గత రాత్రి గ్లెన్ మాక్స్‌వెల్ అయితే, ఇక్కడ పుణెలో బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఒంటికాలిపై బ్యాటింగ్ చేశాడు. నెదర్లాండ్స్‌కు చెందిన బౌలర్లు బాస్ డి లీడే మూడు వికెట్లు పడగొట్టగా, ఆర్యన్ దత్, లోగాన్ వాన్ బీక్ తలో రెండు వికెట్లు సాధించారు. పాల్‌ వాన్‌ మీకెరన్ ఒక వికెట్‌ తీశాడు. మరి ఈ భారీ స్కోరును నెదర్లాండ్స్‌ ఛేదించగలదా లేదో వేచి చూడాల్సిందే.

Exit mobile version