NTV Telugu Site icon

Beggar: యాచకుడి జేబులో రూ.5 లక్షలు.. మ్యాటరేంటంటే.?

Beggar Money

Beggar Money

Beggar Having Huge amount of money : ఓ బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలకు పైగా నగదు దొరికిన షాకింగ్ ఘటన పాకిస్థాన్‌ లో వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ బిచ్చగాడు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండగా.. అతడిని రక్షించే సమయంలో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా.. అతని జేబులో భారీగా డబ్బు కనిపించింది. పాకిస్థాన్ మీడియా నివేదిక ప్రకారం.., పంజాబ్ ప్రావిన్స్‌ లోని సర్గోధా జిల్లాలోని ఖుషబ్ రోడ్‌లో బిచ్చగాడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన రెస్క్యూ టీమ్ అతడి నుంచి రూ.5 లక్షల 34 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిచ్చగాడి నుంచి పలుమార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు తెలిపే పాస్‌ పోర్టు కూడా లభించింది. వృద్ధుడు సౌదీ అరేబియా వెళ్లి భిక్షాటన చేసేవాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Ambati Rambabu: ఏపీకి ఇచ్చిన రూ. 15 వేల కోట్లు గ్రాంట్ కాదు అప్పు..?

స్థానిక అధికారి మాట్లాడుతూ.., ఒక తెలియని కాల్ వచ్చిందని దాని తర్వాత వృద్ధుడికి సహాయం చేయడానికి ఓ రెస్క్యూ టీమ్ కు చేరుకుందని., ఆ వ్యక్తి అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తాడని అక్కడి ప్రజలు ఆ బృందానికి తెలిపారు. వృద్ధుడిని ఆసుపత్రికి తరలించామని అతను కోలుకున్నాక ఇంటికి వెళ్లే మార్గంలో అతని డబ్బు, వస్తువులన్నీ తిరిగి ఇచ్చామని రెస్క్యూ అధికారులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్థాన్ పౌరులు ఉమ్రా వీసాపై సౌదీ అరేబియాకు వెళ్లి భిక్షాటన చేస్తున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. మానవ అక్రమ రవాణా మార్గాల ద్వారా పెద్ద సంఖ్యలో యాచకులు విదేశాలకు వెళ్తున్నారని ఓవర్సీస్ పాకిస్థానీలు, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెనేట్ కమిటీకి తెలిపింది.

Rafale Jets: రాకెట్‌ దూసుకెళ్తుండగా తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

విదేశాల్లో అరెస్టయిన యాచకుల్లో 90% మంది పాకిస్థానీలేనని సెనేట్ కమిటీకి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. ‘ఇరాక్, సౌదీ అరేబియా రాయబారులు ఇటువంటి అరెస్టులు తమ జైళ్లలో కిక్కిరిసిపోయేలా చేశాయని చెప్పారు. సౌదీ అరేబియాలోని మస్జిద్ అల్ హరామ్ వెలుపల పట్టుబడిన పిక్ పాకెట్లలో ఎక్కువ మంది పాకిస్థానీ మూలానికి చెందినవారని., ఈ వ్యక్తులు భిక్షాటన చేయడానికి ఉమ్రా వీసాపై సౌదీకి చేరుకుంటారని వారు తెలిపారు.