Shah Rukh Khan : డంకీ రిలీజ్ కు ముందు మరోసారి ఆ అమ్మవారిని దర్శించుకున్న కింగ్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా రెండు భారీ విజయాలను అందుకొని తన రేంజ్ ఏంటో మరోసారి చూపించారు.ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పఠాన్ మూవీ ఏకంగా వెయ్యికోట్ల రూపాయలను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమాలో విలన్ గా నటించారు.2023 జనవరి 25న హిందీతో పాటు తమిళం మరియు తెలుగులో కూడా విడుదలై పఠాన్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే పఠాన్ రిలీజ్ కు ముందు షారుఖ్ ఖాన్ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో పఠాన్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత షారుఖ్ జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సౌత్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ మూవీ తెరకెక్కింది. జవాన్ కూడా భారీ విజయాన్ని అందుకుంది. జవాన్ కూడా 1000కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.జవాన్ సినిమా రిలీజ్ కు ముందు కూడా షారుఖ్ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఇప్పుడు మూడో సారి షారుఖ్ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన నటించిన డంకి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో సెంటిమెంట్ గా ఈ సినిమా రిలీజ్ కు ముందు షారుక్ ఇలా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.అయితే షారుఖ్ ఖాన్ డంకీ సినిమాకు పోటీగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22 న విడుదల అవుతుంది. దీనితో ఈ రెండు బిగ్గెస్ట్ మూవీస్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగనుంది.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!