Beer Drinkers: ఈ దేశ ప్రజలు బీరు బాటిళ్లతో కాదు.. బక్కెట్లు, బిందెల కొద్ది తాగుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beer Drinkers: వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రపంచంలో అత్యధికంగా బీర్ తాగే దేశాల జాబితాను విడుదల చేసింది. డేటా ప్రకారం చెక్ రిపబ్లిక్లో ప్రజలు ఎక్కువ మోతాదులో బీరు తాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రజలు ఆల్కహాల్ కేటగిరీలో బీరును ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. చెక్ రిపబ్లిక్‌లో ఒక వ్యక్తి ఏడాదికి 140 లీటర్ల బీరు తాగుతున్నాడు. నెలవారీగా చూస్తే.. ఒక వ్యక్తి నెలలో పదకొండున్నర లీటర్ల బీరు తాగుతున్నాడు. ఈ విషయంలో భారత దేశం చాలా వెనుకబడి ఉంది.
టాప్ 10లో 9 యూరోపియన్ దేశాలు
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధికంగా బీర్ వినియోగించే దేశాల జాబితాలో 10 దేశాలలో తొమ్మిది యూరప్‌కు చెందినవి. అగ్ర దేశాలలో చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, రొమేనియా, జర్మనీ, పోలాండ్, ఐర్లాండ్, స్పెయిన్, క్రొయేషియా, లాట్వియా ఉన్నాయి. టాప్ 10లో ఉన్న ఏకైక నాన్-యూరోపియన్ దేశం నమీబియా. నమీబియాలో ప్రతి వ్యక్తి ఏడాదికి 95.5 లీటర్ల బీరు తాగుతాడు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ఇది దేశాల ర్యాంకింగ్
Beer consumption per capita (liters per year):
🇨🇿 Czechia: 140.0
🇦🇹 Austria: 107.8
🇷🇴 Romania: 100.3
🇩🇪 Germany: 99.8
🇵🇱 Poland: 97.7
🇳🇦 Namibia: 95.5
🇮🇪 Ireland: 92.9
🇪🇸 Spain: 88.8
🇭🇷 Croatia: 85.5
🇱🇻 Latvia: 81.4
🇪🇪 Estonia: 80.5
🇸🇮 Slovenia: 80.0
🇳🇱 Netherlands: 79.3
🇧🇬…— World of Statistics (@stats_feed) September 21, 2023
రెండో స్థానంలో ఆస్ట్రియా
ఆ తర్వాత ఆస్ట్రియా రెండో స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ప్రతి వ్యక్తి ఏడాదికి 107.8 లీటర్ల బీరు తాగుతున్నాడు. రొమేనియాలో ఒక వ్యక్తి 100.3 లీటర్లు, జర్మనీలో 99.8 లీటర్లు మరియు పోలాండ్‌లో 97.7 లీటర్లు. ఐర్లాండ్‌లోని ప్రతి వ్యక్తి ఏడాదికి 92.9 లీటర్ల బీరు తాగుతున్నారు. అదేవిధంగా, స్పెయిన్‌లో తలసరి వార్షిక బీర్ వినియోగం 88.8 లీటర్లు, క్రొయేషియాలో 85.5 లీటర్లు, లాట్వియాలో 81.4 లీటర్లు. దీని తర్వాతి స్థానాల్లో ఎస్టోనియా (80.5 లీటర్లు), స్లోవేనియా (80 లీటర్లు), నెదర్లాండ్స్ (79.3 లీటర్లు), బల్గేరియా (78.7 లీటర్లు), పనామా (78.3 లీటర్లు), ఆస్ట్రేలియా (75.1 లీటర్లు), లిథువేనియా (74.4 లీటర్లు) ఉన్నాయి.
బీర్ వినియోగం విషయంలో భారత్ చాలా తక్కువ. భారతదేశంలో సగటు వ్యక్తి ఏడాదికి రెండు లీటర్ల బీరు తాగుతాడు. కేవలం ఇండోనేషియా మాత్రమే భారతదేశానికి దిగువన ఉంది. ఇస్లామిక్ దేశం ఇండోనేషియాలో తలసరి వార్షిక వినియోగం 0.70 లీటర్లు మాత్రమే.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..