NTV Telugu Site icon

Bedurulanka 2012 : సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన బెదురులంక మూవీ..

Whatsapp Image 2023 09 22 At 9.43.21 Am

Whatsapp Image 2023 09 22 At 9.43.21 Am

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012.ఫన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ డైరెక్టర్‌ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్ట్ 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన బెదురులంక 2012 మూవీ కమర్షియల్ సక్సెస్‌ గా నిలిచింది.నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా ఏడు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.చాలా రోజుల తర్వాత హీరో కార్తికేయ ఈ సినిమాతో మంచి హిట్‌ ను అందుకున్నాడు.అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌ లో ఈ మూవీ రిలీజైంది.అయితే థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాకముందే బెదురులంక 2012 మూవీ ఓటీటీ లోకి రావడం విశేషం.విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది.

అలాగే ఈ సినిమాలో అజయ్ ఘోష్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, సత్య ముఖ్య పాత్రల్ని పోషించారు.2012 లో యుగాంతం పుకార్ల కారణం గా బెదురులంక అనే ఊరి ప్రజలు బాగా భయాందోళనలకు గురవుతుంటారు. ప్రజల్లోని భయం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భూషణం (అజయ్ ఘోష్‌) అనే లీడర్ ఊరిని దోచుకోవాలని పక్కా ప్లాన్ చేస్తాడు. అతడి ప్లాన్ ను శివ (కార్తికేయ) ఎలా ఎదురించాడు..ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే ఊరి ప్రెసిడెంట్ కూతురు చిత్ర తో (నేహాశెట్టి) శివ ప్రేమాయణం ఎలా మొదలైందన్నదే బెదురులంక 2012 మూవీ కథ. ఈ సినిమాలో కామెడీతో పాటు ఓ చిన్న మెసేజ్‌ను కూడా డైరెక్టర్ క్లాక్స్ బెదురులంక 2012 మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కు మణిశర్మ సంగీతాన్ని అందించాడు.థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏవిధంగా అదరగొడుతుందో చూడాలి..

Show comments