Bedurulanka 2012 : సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన బెదురులంక మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012.ఫన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ డైరెక్టర్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్ట్ 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన బెదురులంక 2012 మూవీ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది.నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా ఏడు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.చాలా రోజుల తర్వాత హీరో కార్తికేయ ఈ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు.అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ రిలీజైంది.అయితే థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాకముందే బెదురులంక 2012 మూవీ ఓటీటీ లోకి రావడం విశేషం.విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ సరసన నేహా శెట్టి హీరోయిన్గా నటించింది.
అలాగే ఈ సినిమాలో అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ముఖ్య పాత్రల్ని పోషించారు.2012 లో యుగాంతం పుకార్ల కారణం గా బెదురులంక అనే ఊరి ప్రజలు బాగా భయాందోళనలకు గురవుతుంటారు. ప్రజల్లోని భయం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భూషణం (అజయ్ ఘోష్) అనే లీడర్ ఊరిని దోచుకోవాలని పక్కా ప్లాన్ చేస్తాడు. అతడి ప్లాన్ ను శివ (కార్తికేయ) ఎలా ఎదురించాడు..ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే ఊరి ప్రెసిడెంట్ కూతురు చిత్ర తో (నేహాశెట్టి) శివ ప్రేమాయణం ఎలా మొదలైందన్నదే బెదురులంక 2012 మూవీ కథ. ఈ సినిమాలో కామెడీతో పాటు ఓ చిన్న మెసేజ్‌ను కూడా డైరెక్టర్ క్లాక్స్ బెదురులంక 2012 మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కు మణిశర్మ సంగీతాన్ని అందించాడు.థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏవిధంగా అదరగొడుతుందో చూడాలి..
Also Read
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
తాజావార్తలు
-
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్‌దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
-
Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్..
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..