NTV Telugu Site icon

Bear at TTD : తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గంలో ఎలుగుబండి హల్‌చల్‌

Bear

Bear

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు మెట్టుమార్గంలో వెళ్తున్న భక్తులను వన్యప్రాణాలు హడలెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజలు క్రితం కౌశిక్‌ అనే బాలుడిపై చిరుత దాడి చేయగా.. ఇటీవల లక్షిత అనే బాలికపై చిరుత దాడి చంపిన ఘటనలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే.. భక్తులను సంరక్షించేందుకు రంగంలోకి దిగి అటవీశాఖ మెట్టుమార్గంలో సంచరిస్తున్న చిరుత పులిని పట్టుకునేందుక బోను ఏర్పాటు చేయడంతో.. ఈ రోజు ఉదయం బోను చిరుత చిక్కింది. అయితే.. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులకు మరోసవాల్‌ ఎదురైంది. అదే ఎలుగుబంటి.. సోమవారం ఉదయం మెట్టు మార్గంలోని 2వేల మెట్టు వద్ద ఎలుగుబంటి తారసపడటంతో భక్తులు బెంబెలెత్తిపోయారు. భక్తులను అధికారులను అప్రమత్తం చేయడంతో ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో అటవీశాఖ, టీటీడీ భద్రతా సిబ్బంది మెట్టుమార్గంలో గస్తీ ముమ్మరం చేశారు.

Also Read : Virupaksha team : మళ్ళీ జట్టు కట్టిన విరూపాక్ష టీం.. ఈ సారి అంతకు మించి ప్లాన్ చేస్తున్నారుగా

ఇదిలా ఉంటే.. అలిపిరి కాలిబాటలోని నరసింహస్వామి ఆలయానికి సమీపంలోని నామలగవి అటవీ ప్రాంతంలో సోమవారం మరో చిరుతపులి కనిపించడంతో టీటీడీ, అటవీశాఖ అప్రమత్తమయ్యాయని అటవీశాఖ వర్గాలు తెలిపాయి. కాగా, అలిపిరి నుంచి గాలిగోపురం, గాలిగోపురం నుంచి నరసింహస్వామి దేవాలయం, ఘాట్‌రోడ్డు మధ్య ఫుట్‌పాత్‌కు సమీపంలోని అటవీ ప్రాంతంతో పాటు మూడు ప్రాంతాల్లో చిరుతపులుల సంచారాన్ని అటవీశాఖ నిర్ధారించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

Also Read : Nani Controversy: పాన్ ఇండియా స్టార్ వ్యాఖ్యలు.. నానిపై మండిడుతున్న బడా హీరోల ఫ్యాన్స్