2025 ఆసియా కప్ ట్రోఫీ అప్పగింత అంశంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో చర్చించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ట్రోఫీ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మొండి వైఖరితో ఉండటంతో.. త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాలని బోర్డు యోచిస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు.
Also Read: PAK vs SA: 38 ఏళ్ల వయసులో అరంగేట్రం.. 6 వికెట్లతో 92 ఏళ్ల రికార్డు బద్దలు!
ఆసియా కప్ ట్రోఫీ అప్పగింతకు సంబంధించి మోహ్సిన్ నఖ్వీ చేసిన సూచనను బోర్డు అంగీకరించదు అని బీసీసీఐ ఉన్నతాధికారి చెప్పారు. డిసెంబర్ 4 నుంచి 7 వరకు దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశం ఈ అంశాన్ని చర్చించడానికి బీసీసీఐ సిద్దమవుతోందని తెలిపారు. ‘ట్రోఫీని దుబాయ్ ఏసీసీ కార్యాలయంలో ఉంది. ఏ బీసీసీఐ అధికారి లేదా భారత ఆటగాడు అక్కడికి వచ్చి ఏసీసీ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవచ్చు’ అని బీసీసీఐ పంపిన హెచ్చరిక ఇ-మెయిల్‌కు నఖ్వీ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది.
