Site icon NTV Telugu

BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

Bcci

Bcci

BCCI: భారత క్రికెట్ జట్టుకు నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ సూపర్ స్టార్లను అందించడమే లక్ష్యంగా బీసీసీఐ (BCCI) మాస్టర్ ప్లాన్ వేసింది. U-25 పురుషుల హై-పెర్ఫార్మెన్స్ క్యాంప్ కోసం 25 మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లను షార్ట్‌ లిస్ట్ చేస్తూ నేడు (ఏప్రిల్ 7) ఓ లిస్ట్ విడుదల చేసింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరం జరగనుంది.

Rahane-Sehwag: మాటలు వద్దు, ఆడి చూపించు.. కేకేఆర్ కెప్టెన్ రహానేపై సెహ్వాగ్‌ ఫైర్!

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే.. అంటే జూన్, జూలై నెలల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లోపల ఒక ప్రత్యేక టోర్నమెంట్‌ ను నిర్వహించనున్నారు. ఇది పూర్తిగా ‘రెడ్ బాల్’ (నాలుగు రోజుల మ్యాచ్‌లు) ఫార్మాట్‌లో సాగుతుంది. ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ 64 మంది యువ క్రికెటర్లు పాల్గొంటారు. ఇక వీరి ఎంపిక చూస్తే.. సి.కె. నాయుడు ట్రోఫీ, U-23 వన్డేల నుండి 25 మంది, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే (VHT), సయ్యద్ ముస్తాక్ అలీ (SMAT) టోర్నీల నుండి 25 మందిని సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. అలాగే ఐపీఎల్ (IPL) ఆడుతున్న యువ ఆటగాళ్ల నుండి 14 మందిని సెలెక్ట్ చేయనున్నారు.

ప్రస్తుతం విడుదల చేసిన 25 మంది జాబితాలో స్టార్ ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే పేర్లు లేకపోవడంతో అభిమానుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వీరు ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నందున పైన పేర్కొన్న ’14 మంది ఐపీఎల్ కోటా’ జాబితాలో వీరిని చేర్చనున్నారు. ప్రస్తుతం ఆయుష్ మాత్రే చెన్నై సూపర్ కింగ్స్‌కు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా రాణిస్తున్నారు. ఈ క్యాంప్ కోసం ఎంపికైన వారిలో యశ్ ధుల్, రాజ్ లింబానీ, సిద్ధార్థ్ దేశాయ్ వంటి ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు కొత్త ముఖాలు కూడా ఉన్నాయి.

Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

ఈ టోర్నమెంట్, క్యాంప్ అంతా బీసీసీఐ CoE హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో జరగనుంది. ఏప్రిల్ 12 నుండి మే 7 వరకు బెంగళూరులో ఈ శిబిరం కొనసాగుతుంది. ప్రతిభావంతులైన యువకులను గుర్తించి వారిని అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయడమే లక్ష్మణ్ ప్రధాన బాధ్యత. ఐపీఎల్ తర్వాత భారత్ U-19, ఇండియా ఎమర్జింగ్ (U-25) జట్లు శ్రీలంక పర్యటనకు కూడా వెళ్లనున్నాయి. ఈ టోర్నీ ద్వారా ఎంపికైన వారు భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యులుగా మారే అవకాశం ఉంది.

Exit mobile version