NTV Telugu Site icon

BCCI: గొప్ప మనసు చాటుకున్న బీసీసీఐ.. నేపాల్ జట్టుకు ఇండియాలో శిక్షణ

Nepal Cricket

Nepal Cricket

బీసీసీఐ గొప్ప మనసు చాటుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత.. నేపాల్ క్రికెట్ జట్టుకు భారత్లో సాయం అందించేందుకు ముందుకొచ్చింది. కాగా.. బీసీసీఐ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌ను భారతదేశంలో తన మ్యాచ్‌లను నిర్వహించడానికి అనుమతించింది. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రెండు వారాల ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనేందుకు నేపాల్ జట్టుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. కెనడాలో జరగనున్న ‘క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 సిరీస్’ సన్నాహాల్లో భాగంగా నేపాల్ క్రికెట్ జట్టు బెంగళూరులోని ఎన్సీఏలో శిక్షణ తీసుకోనుంది.

Rekha Sharma: సీఎం మమతకు మహిళలంటే గౌరవం ఉండదు

నేపాల్ జట్టు ముక్కోణపు సిరీస్ ఆడేందుకు కెనడాకు వెళ్లే ముందు రెండు వారాల పాటు ఎన్సీఏలో ప్రాక్టీస్ చేస్తుంది. ఈ సిరీస్‌లో కెనడా, నేపాల్‌తో పాటు ఒమన్‌ జట్టు కూడా పాల్గొననున్నాయి. లీగ్ 2 పట్టికలో నేపాల్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. కాగా.. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం ‘X’లో స్పందించింది. “నేపాల్ జట్టు ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 సిరీస్‌కు సిద్ధం కావడానికి NCAకి వెళుతోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)లో రెండు వారాల శిక్షణ మా ఆటగాళ్ల నైపుణ్యాలు మరియు వ్యూహాలను మెరుగుపరుస్తుంది”. అని పేర్కొంది.

రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. మస్తాన్ సాయి ఫోన్ లో అమ్మాయిల వీడియోలు!!

నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ పౌడెల్, దీపేంద్ర సింగ్ ఎయిరి, సందీప్ లమిచానే ఇటీవల కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడుతున్నారు. అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు ముందు నేపాల్ జట్టు భారత్‌లో కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పాల్గొంది. ఈ సమయంలో జట్టు గుజరాత్, బరోడాలో ఆడింది. నేపాల్ జట్టు డిసెంబర్ 2026 నాటికి లీగ్ 2 పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా జట్టు క్రికెట్ ప్రపంచ కప్ (CWC) క్వాలిఫైయర్‌కు చేరుకుంటుంది. మొదటి నాలుగు స్థానాల్లో విఫలమైతే జట్టు CWC క్వాలిఫైయర్ ప్లేఆఫ్‌ను ఆడవలసి వస్తుంది. ఇక్కడ నుండి మొదటి నాలుగు జట్లు CWC క్వాలిఫైయర్‌లకు చేరుకుంటాయి.

Show comments