Site icon NTV Telugu

BCCI Central Contracts: టీమిండియాలో ప్రకంపనలు.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ భారీ షాక్!

Bcci Central Contracts

Bcci Central Contracts

BCCI Central Contracts: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-26 సీజన్ కోసం ఆటగాళ్లకు కేంద్ర కాంట్రాక్టులను ప్రకటించింది. BCCI ఈసారి జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లను చేర్చింది. కానీ A+ కేటగిరీని తొలగించింది. ఈ 30 మంది ఆటగాళ్లను మూడు గ్రేడ్‌లుగా విభజించారు. వీరిలో ముగ్గురు ఆటగాళ్లను గ్రేడ్ Aలో, 11 మంది ఆటగాళ్లను గ్రేడ్ Bలో, 16 మంది ఆటగాళ్లను గ్రేడ్ Cలో చేర్చారు.

READ ALSO: సగం ధరకే Wobble QLED TV.. బెస్ట్‌ ఫీచర్లు, క్వాలిటీ సౌండ్‌..

అత్యున్నత గ్రేడ్ పొందిన ఆ ముగ్గురు ఆటగాళ్లు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలను గ్రేడ్ A లో చేర్చింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు అత్యధిక జీతం పొందుతారు. అదే సమయంలో గ్రేడ్ B లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, KL రాహుల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.

విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ గతంలో A+ గ్రేడ్‌లో ఉన్నారు. అయితే ఇద్దరు ఆటగాళ్లు T20I, టెస్ట్ ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ స్టార్ జోడీ ODI ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. దీని ఫలితంగా వారి డిమోషన్ జరిగినట్లు సమాచారం.

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా

గ్రేడ్ A: శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్-బి: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్.

గ్రేడ్-సి: తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సంజు శాంసన్, రింకూ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ధ్రువ్ జురైల్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్

మహిళా జట్టు కొత్త కేంద్ర కాంట్రాక్ట్ జాబితా

గ్రేడ్-ఎ: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ.

గ్రేడ్-బి: రేణుకా ఠాకూర్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ రాణా.

గ్రేడ్-సి: రాధా యాదవ్, అమంజోత్ కౌర్, ప్రతీకా రావల్, క్రాంతి గౌర్, ఉమా ఛెత్రి, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, యాస్తికా భాటియా, హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, జి కమలిని, వైష్ణవి శర్మ, తేజల్.

READ ALSO: Shabana Mahmood: క్రైస్తవ దేశానికి ముస్లిం ప్రధాని.. లండన్ పీఠంపై పాక్ సంతతి మహిళ?

Exit mobile version