BCCI: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను తొలగించాలని చేయాలని బీసీసీఐ అధికారికంగా కోరింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. కొంతకాలంగా పెరుగుతున్న ప్రజా, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.