Teamindia: దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు భారత మహిళల జట్టులను ప్రకటించిన బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్ కు భారత మహిళల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.. డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరిస్తుంది. బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, స్పీడ్‌స్టర్ పూజా వస్త్రాకర్ మూడు స్క్వాడ్ లలో భాగంగా ఉన్నారు. అయితే వారు ఆడటం అనేది ఫిట్‌నెస్ పై ఆధారపడి ఉంటుంది.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తో సిరీస్ ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఒక టెస్ట్, ఆపై మూడు మ్యాచ్ ల T20 సిరీస్ తో ముగుస్తుంది. వన్డే సిరీస్‌కు ముందు, జూన్ 13న బెంగళూరులో బోర్డ్ ప్రెసిడెంట్స్ XI జట్టుతో విజిటింగ్ జట్టు వార్మప్ గేమ్ ఆడుతుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా బెంగళూరులో జరుగుతుంది. మిగిలిన సిరీస్ చెన్నైలో జరగనుంది. వార్మప్ గేమ్ తర్వాత మూడు వన్డేలు వరుసగా జూన్ 16, 19, 23 తేదీల్లో జరుగుతాయి. జూన్ 28 నుంచి జూలై 1 వరకు ఏకైక టెస్టు.. చివరగా మూడు టీ20లు వరుసగా జూలై 5, 7, 9 తేదీల్లో జరుగుతాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఈ ఒక్క టెస్టు గత ఏడు నెలల్లో భారత్‌కి మూడో టెస్టు మ్యాచ్ గా చెప్పవచ్చు. గత డిసెంబర్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత్ ఒక్కో టెస్టు ఆడింది. ఇరు జట్ల పై చక్కటి ఆటతీరుతో భారత్ విజేతగా నిలిచింది. ఈ పర్యటనలోని మూడు వన్డేలు 2022-2025 ICC మహిళల ఛాంపియన్ షిప్‌లో భాగంగా ఉన్నాయి. ఆతిథ్య భారత్‌తో పాటు ఛాంపియన్‌షిప్‌లోని మొదటి ఐదు జట్లు ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025కి నేరుగా అర్హత సాధిస్తాయి.
వన్డే సిరీస్ కోసం భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (డబ్ల్యుకె), దయాళన్ హేమలత, రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ప్రియా పునియా.
టెస్ట్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమీమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (WK), ఉమా చెత్రీ (WK), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్ , రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్ *, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియా.
టీ20 సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, ఉమా చెత్రీ (డబ్ల్యుకె), రిచా ఘోష్ (డబ్ల్యుకె), జెమిమా రోడ్రిగ్స్ *, సజన సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, ఆశా శోభన, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి. స్టాండ్‌బై గా సైకా ఇషాక్ ను ఎంపిక చేసారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!