NTV Telugu Site icon

Asian Games 2023: భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరూ ఊహించరు! టీ20 టీమ్ ఇదే

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad is New Team India Captain for Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడలు 2023 (ఏషియన్ గేమ్స్ 2023) కోసం భారత పురుషుల టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టును శుక్రవారం బీసీసీఐ ప్రకటించింది. ఆసియా క్రీడల కోసం వెళ్లే భారత జట్టుకు యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌లో సత్తాచాటిన అందరికీ జట్టులో చోటు దక్కింది. ఇక సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి.

ఏషియన్ గేమ్స్ 2023 కోసం ఎంపిక చేసే జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ కెప్టెన్సీ చేయనున్నాడని ముందునుంచి వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం అతడికి షాక్ ఇస్తూ.. పూర్తిగా యువ ఆటగాళ్లనే ఎంచుకుంది. ఎవరూ ఊహించని విధంగా రుతురాజ్‌ గైక్వాడ్‌ను కెప్టెన్ చేశారు. తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మకు జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్‌ స్టార్‌ రింకు సింగ్‌ తొలిసారిగా జట్టులో చోటు సంపాదించాడు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు.

Also Read: WI vs IND: అశ్విన్ స్పిన్‌ మాయాజాలం.. తొలి టెస్టులో భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయం!

ఆసియా క్రీడలు 2023లో పురుషుల ఆట సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో భారత్‌లో అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ 2023 జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టు ఏషియన్ గేమ్స్ 2023 పాల్గొంటుంది. 2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్‌ ఉన్నా భారత్ మాత్రం పాల్గొనలేదు. ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం ఒత్తిడి తేవడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత టీ20 జట్టు (India T20 squad for Asian Games 2023):
రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయ్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, శివమ్‌ మావి, శివమ్‌ దూబె, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌.
స్టాండ్‌బైలు:
యశ్‌ ఠాకూర్‌, సాయికిశోర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, సాయిసుదర్శన్‌.

Also Read: Today Gold Price: స్థిరంగా బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి!