NTV Telugu Site icon

BC Dharna: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా

Bc Dharna

Bc Dharna

BC Dharna: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ బీసీ సంఘం ఈ నెల 13, 14 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమంతో పాటు జంతర్‌ మంతర్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనుంది. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 13, 14వ తేదీల్లో నిర్వహిస్తున్నామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చలో ఢిల్లీ పోస్టర్ రిలీజ్ చేశామని.. బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 40 సంవత్సరాలుగా ఈ ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోందన్నారు.

Read Also: MLA TJR Sudhakar Babu: నువ్వెంత.. నీ బతుకెంత?.. లోకేష్‌పై ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్

కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలన్నారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. జనగణనలో కులగణనను అమలు చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఓబీసీల వాటాను పెంచాలని కోరారు.