NTV Telugu Site icon

BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి బీసీ జనార్థన్ రెడ్డి ఛాలెంజ్..!

Bc 3

Bc 3

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో షాదీఖానా చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కోవెలకుంట్ల పట్టణంలో షాదీఖానా విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి జరుగుతోంది. షాదీఖానా పేరుతో మభ్యపెట్టి, కమ్యూనిటీ హాల్‌ నిర్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బీసీ జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. షాదీఖానా కట్టిస్తా అంటూ ముస్లింల స్థలం తీసుకుని.. అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించి, ముస్లింలను మోసం చేసిన దగాకోరు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అంటూ.. బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈనెల 14వ తేదీన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోవెలకుంట్లలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో షాదీ ఖానా పేరు చెప్పి ముస్లిం మత పెద్దలతో భూమి పూజ చేయించి, ఇప్పుడు షాదీఖానాకు బదులుగా కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి ముస్లింలను మోసగించాడని మండిపడ్డారు. స్థలం ఇచ్చిన దాతకు కూడా షాదీఖానా కడతాం అని చెప్పి, తీరా కమ్యూనిటీ హాల్ నిర్మించిన దాతని కూడా కాటసాని రామిరెడ్డి మోసం చేసాడని బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు.

Sandeshkhali Violence: సందేశ్‌ఖలీ హింసపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..

అసలు ఇది షాదీఖానా అంటారా.. వధూవరులు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదులు లేవు, ఇంకా బాత్రూంలు కట్టలేదు..వంటశాలలు లేవు.. వంట సామాగ్రి లేదు.. ఇంకా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నా.. ఎన్నికల కోడ్ వస్తుందనే కారణంతో నీ పేరు కోసం హడావుడిగా కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి.. ముస్లింల మనోభావాలను దెబ్బతీశావని కాటసాని రామిరెడ్డిపై బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోవెలకుంట్ల నడిబొడ్డులో పేద ముస్లింలకు అనువుగా ఉండేలా…కోటి 25 లక్షలు నిధులు మంజూరు చేయించడమే కాకుండా, సొంతంగా 25 లక్షలు సమకూర్చి షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, కానీ ఎన్నికల కోడ్ రావడం పనులు ఆగిపోయాయని బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే షాదీఖానా నిర్మాణం పూర్తి చేయకుండా.. ఊరిబయట 3 కి.మీ. దూరంలో షాదీఖానా కట్టిస్తానని మభ్యపెట్టి ముస్లింల దాతల దగ్గర స్థలం సేకరించి, కమ్యూనిటీ హాల్‌ కట్టించి వారిని మోసం చేసాడని ఆరోపించారు.

Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

తక్షణమే షాదీఖానా పేరుతో కమ్యూనిటీ హాల్‌ను కట్టించిన కాటసాని రామిరెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే కోవెలకుంట్లలో 6 నెలల్లో ముస్లింల కోసం ప్రత్యేకంగా అన్ని వసతులతో కూడిన షాదీఖానాను కట్టించి తీరుతానని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సవాల్ విసిరారు. మొత్తంగా కోవెలకుంట్లలో షాదీఖానా పేరుతో కమ్యూనిటీ హాల్ కట్టించి, తమను మోసం చేసాడంటూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.