ఎన్నికల ప్రచారంలో బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి, కుమార్తె, కోడలు, సోదరులంతా ఏకమై ఊరూరా ఇంటింటికి తిరుగుతూప్రజలతో మమేకవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ కుటుంబ సభ్యుల ప్రచారానికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మరోవైపు.. ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలు టీడీపీ, వైపీపీ పోటాపోటీగా ప్రచారం చేస్తేన్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఓవైపు నిత్యం వైసీపీ నుంచి వందలాదిగా తరలివస్తున్న నాయకులను, కార్యకర్తలను అక్కున చేర్చుకుంటూనే.. మరోవైపు నియోజకవర్గవ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం ఊరూరా టీడీపీ, జనసేన, బీజేపీ, నాయకులు, కార్యకర్తలు, బీసీ అభిమానులతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు.
లోక కల్యాణానికి పంచ భూతాలు సహకరించినట్లు.. బనగానపల్లె ప్రజల జీవితాల్లో మార్పు కోసం పోరాడుతున్న బీసీ జనార్థన్ రెడ్డికి తోడుగా ఆయన సోదరులు బీసీ రాజారెడ్డి, బీసీ రామ్‌నాథ్ రెడ్డి, సతీమణి శ్రీమతి బీసీ ఇందిర రెడ్డి, కుమార్తె బీసీ మనోరమా రెడ్డి, కోడలు క్షీరా రెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారంలోకి దూకారు. సోదరులు బీసీ రాజారెడ్డి, రామ్‌నాథ్ రెడ్డి తదితరులు బీసీ జనార్థన్ రెడ్డి ఎన్నికల ప్రచార వ్యూహంలో నిమగ్నం కాగా.. బీసీ ఇందిర రెడ్డి, కుమార్తె మనోరమా రెడ్డి, కోడలు బీసీ క్షీరారెడ్డి తదితరులు ప్రజాక్షేత్రంలో మండుటెండల్లో సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాలలో పర్యటిస్తున్న బీసీ ఇందిర రెడ్డి, మనో రమారెడ్డి, బీసీ క్షీరారెడ్డి తదితరులకు స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎదురేగి ఆహ్వానం పలుకుతున్నారు. ముఖ్యంగా బీసీ కుటుంబాన్ని అభిమానించే మహిళలు.. వాడవాడలా హారతులు పడుతూ, సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతున్నారు.
Salman Khan Firing: షాకింగ్: కాల్పుల కేసులో మరో ఇద్దరి అరెస్టు?
తాజాగా.. సంజామల మండలం, గిద్దలూరు, మిక్కినేనిపల్లి, రామ భద్రుని పల్లె, మంగంపల్లె గ్రామాలలో.. బీసీ జనార్థన్ రెడ్డి సతీమణి శ్రీమతి బీసీ ఇందిర రెడ్డి, కోడలు బీసీ క్షీరా రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా సలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ.. బీసీ జనార్థన్ రెడ్డి గెలవగానే అన్ని సమస్యలు తీరుస్తామని భరోసా ఇస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా టీడీపీ ప్రకటించిన 6 సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. తల్లికి వందనం పథకం కింద పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి ఏటా రూ. 15000/- ఆర్థిక సాయం అందుతుందని, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ. 1500/-, ,యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రైతులకు ఏడాదికి రూ. 20, 000/- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సూపర్ సిక్స్ పథకాలే కాకుండా.. రాబోయే ప్రభుత్వం పెన్షన్ రూ. 3 వేల నుంచి 4 వేలు ఇష్తుందని, వృద్ధులకు వివరించారు.
రాష్ట్రం భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, బనగానపల్లె మళ్లీ అభివృద్ధి జరగాలంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. బనగానపల్లె నియోజకవర్గంలో బీసీ జనార్థన్ రడ్డి తరపున ఆయన కుటుంబసభ్యులు చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది. బీసీ కుటుంబం అంటే బనగానపల్లె ప్రజలకు ఎంత ప్రేమో.. ఇందిర రెడ్డి, మనోరమా రెడ్డి, క్షీరా రెడ్డిల ప్రచారం చూస్తే అర్థమవుతోందని స్థానికులు అంటున్నారు. మొత్తంగా అగ్నికి వాయివు తోడైనట్లుగా బీసీ జనార్ధన్ రెడ్డికి తోడుగా ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రచారంతో బనగానపల్లెలో వార్ వన్‌సైడ్ అయినట్లే అని… ఈసారి అరుంధతీ కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.