BC Janardhan Reddy: ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలి అన్న దృఢ సంకల్పంతో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేపట్టి ఇంటి ఇంటికి..గడపగడపకి తిరుగుతున్నారు టీడీపీ నేతలు. ఈసారి తమ ప్రభుత్వం రూలింగ్‌లోకి వస్తే ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అన్న విషయాన్ని అందరికీ వివరిస్తూ.. అందరికంటే యాక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి. బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన బనగాపల్లె మండలం , నందవరం గ్రామంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజలలో మమేకమై.. వారి కష్టసుఖాలను అడిగిమరీ తెలుసుకున్నారు.
Read Also: Pawan Kalyan: నేడు విశాఖకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వినూత్నంగా బాబు షూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో పర్యటించారు. సతి సమేతంగా ఆయన నందవరం గ్రామంలోని చౌడేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. జనార్దన్ రెడ్డి దంపతులకు చౌడేశ్వరి అమ్మవారి ఆలయ పూజారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. బనగాపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలి అని అమ్మవారిని జనార్దన్ రెడ్డి ప్రార్థించారు. అనంతరం ఈ దంపతులకు పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు.ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి దంపతులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పాల్గొన్నారు.