బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు చేరుకొని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుల గణనకు మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సమగ్ర కుల గణన, రిజర్వేషన్ల పెంపుకు సహకరించి, మద్దతు తెలపాలని కిషన్ రెడ్డిని కలవడం జరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సమగ్ర కుల గణన చేపడతామని హామి ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని, బీసీల సమగ్ర విచారణ జరపాలని అనేక పోరాటాలు చేశాం, హై కోర్టు కు సైతం వెళ్ళడం జరిగిందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా..’కోర్టు కూడా మూడు నెలల్లో సమగ్ర బీసీ కుల గణన జరపాలని చెప్పింది. రిజర్వేషన్లు తేల్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని హై కోర్టు చెప్పడం జరిగింది. హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర కుల గణన కోసం బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కుల గణన కోసం ప్రభుత్వం జీవో 18 ని విడుదల చేయడం జరిగింది. బీసీ సమగ్ర కుల గణన, రిజర్వేషన్లపై సవివరంగా కిషన్ రెడ్డికి చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు, సంపూర్ణ మద్దతు అందిస్తామని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కుల గణన జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందే. 27 న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల గణనపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.’ అని జాజూల శ్రీనివాస్ అన్నారు.
Cities disasters : మహానగరాలకే ఎందుకీ విపత్తులు..?