NTV Telugu Site icon

Hyderabad: బజార్ ఘాట్ అగ్ని ప్రమాద ఘటన.. రంగంలోకి క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం

Fire Accident

Fire Accident

నాంపల్లి బజార్ ఘాట్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఘటన స్థలంలో మరోసారి క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం క్లూస్ సేకరిస్తున్నాయి. రోడ్డుపై ఆయిల్ పారుతూ ఉండడంతో మట్టి పోసి రోడ్డును సాధారణ పరిస్తితి తెస్తున్న జిహెచ్ఎంసి సిబ్బంది. బిల్డింగ్ లోని మిగిలిన ఆయిల్ డ్రమ్ములు బయటకి తరలించిన జిహెచ్ఎంసి సిబ్బంది.. మరోవైపు బిల్డింగ్ పట్టిష్టతను జెఎన్టీయూ టీమ్ పరిశీలించనుంది. అగ్ని ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కు దగ్గర్లో రమేష్ జైస్వాల్ బాలాజీ ఎంటర్ ప్రాసెస్ షాప్.. షాప్ లో రికార్డులను తనిఖీ చేయడంతో పాటు కార్యకలాపాలను పోలీసులు పరిశీలించారు. సంఘటన స్థలాన్ని క్లూస్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇంచర్జి డాక్టర్ వెంకన్న పరిశీలించారు.

Read Also: Harirama Jogaiah: టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టోపై హరిరామ జోగయ్య అసంతృప్తి

ఈ సందర్భంగా ఎన్టీవీతో క్లూస్ టీం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న మాట్లాడుతూ.. నిన్నటి నుండి ఇప్పటివరకు సుమారుగా 50 నుంచి 60 శాంపిల్స్ ను సేకరించామన్నారు. 10 మంది బృందాలు ఏర్పడి క్లూస్ ను సేకరిస్తున్నాము.. సేకరించిన క్లూస్ ఆధారంగా ప్రాధమికంగా షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాము.. క్రాకర్స్ వలన కూడా ఈ ప్రమాదం జరిగిందా అనే దాని పై క్లారిటీ రావాలిసి ఉంది.. ప్రస్తుతం ఈ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నము.. పూర్తి నివేదిక వచ్చిన అనంతరం ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కెమికల్ శాంపిల్స్ లో పాలిస్టర్ రెసిన్, బ్యానర్ వాడే సామాగ్రి, ప్లాస్టిక్ మెటీరియల్ కెమికల్స్ తయారు చేసేందుకు వినియోగిస్తారు అని క్లూస్ టీమ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న వెల్లడించారు.

Nampally Fire Accident : నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరం | Special Report