NTV Telugu Site icon

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో మళ్లీ నిరసనలు..

Basara Iiit

Basara Iiit

Basara IIIT Students Protest Once Again.

బాసర ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలంటూ గత నెలలో విద్యార్థులు నిరసనలు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్ర విద్యాశాఖ మంత్ర సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు స్వయంగా విద్యార్థులకు ముచ్చటించి కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనలు విరమించారు. అయితే.. గత రాత్రి మళ్లీ విద్యార్థులు నిరసనలకు పూనుకున్నారు.

చెప్పిన విధంగా సమస్యల పరిష్కారానికి వైసీ చర్యలు తీసుకోవడం లేదని.. నాణ్యతలేని ఆహారం తిని ఇప్పటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇటీవల ఫుడ్‌పాయిజన్‌ జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే.. అందులో సంజయ్‌ అనే విద్యార్థు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మరోసారి నిన్న రాత్రి విద్యార్థులు రాత్రి భోజనం చేయకుండా జాగారం ఉండి నిరసన తెలిపారు. అయితే తాజాగా నేడు మరోసారి అధికారులు విద్యార్థులతో సమావేశం కానున్నారు.