Site icon NTV Telugu

Team India: భారత జట్టు వైపు దూసుకొస్తున్న ‘బారాముల్లా డెయిల్ స్టెయిన్’!

Aqib Nabi Team India

Aqib Nabi Team India

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న భారత క్రికెట్ పేరు ‘ఆకిబ్ నబీ’. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌల‌ర్‌ ఆకిబ్.. 2025 రంజీ ట్రోఫీలో చెలరేగుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆకిబ్ తన పేస్ బౌలింగ్‌తో స్టార్ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అసాధారణ వేగంతో బంతులేస్తున్న ఆకిబ్ పేరు ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. దేశవాళీ క్రికెట్ నుంచి మరో పేస్ బౌలింగ్ సంచలనం భారత జట్టు వైపు దూసుకొస్తున్నాడు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

‘బారాముల్లా డెయిల్ స్టెయిన్’ అని ఆకిబ్ నబీకి పేరుంది. ఇందుకు కారణం.. అతడి బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్‌ను పోలి ఉండడమే. ఆకిబ్ అద్భుతమైన పేస్‌ మాత్రమే కాదు.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. 2025 రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ముంబైతో జ‌రిగిన‌ మ్యాచ్‌లో 7 వికెట్లు ప‌డ‌గొట్టిన ఆకిబ్.. రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో ప‌ది వికెట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌పై 2 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్రస్తుతం ఢిల్లీతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్స్ తీశాడు. ఈ రంజీ సీజ‌న్‌లో ఇప్పటికే 24 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Also Read: IPL 2026 Auction: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఐదుగురు స్టార్ ప్లేయర్స్ ఔట్.. లిస్ట్‌లో డేంజర్ బ్యాటర్స్, పేసర్!

తండ్రి ఆశయం మేరకు డాక్టర్ అవ్వాల్సిన ఆకిబ్ నబీ క్రికెటర్ అయ్యాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీతో పాటు అంతకుముందు జరిగిన దులీప్‌ ట్రోఫీలో మెరిశాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. త‌న ఫాస్ట్ క్లాస్ కెరీర్‌లో 34 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీల్లో మెరుస్తున్న ఆకిబ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాడు. అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో బీసీసీఐ సెల‌క్ట‌ర్ల దృష్టిలో పడినట్లు సమాచారం. నబీ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. త్వరలోనే టీమిండియాలోకి వచ్చేస్తాడు.

Exit mobile version