NTV Telugu Site icon

BAN vs IND: టీమిండియాకు ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు ఎంపిక.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

Bcci

Bcci

Three AP Cricketers Bareddy Anusha, Meghna Singh and Anjali Sarvani selected for India Women Team: ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత చాలా రోజుల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జులై 9 నుంచి 22 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లు అన్ని మీర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌ పర్యటనకు పేసర్‌ రేణుక సింగ్‌ గాయంతో దూరం అయింది. వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టారు. రిచా స్థానంలో అసోం యువ వికెట్ కీపర్ ఉమా ఛెత్రికి అవకాశం ఇచ్చారు. వెటరన్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌కు, యువ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు. అయితే బంగ్లాదేశ్‌లో పర్యటించే భారత జట్టుకు ముగ్గురు ఆంధ్రా అమ్మాయిలు ఎంపిక అయ్యారు.

Also Read: Vegetable Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. వెలవెలబోతున్న మార్కెట్లు!

బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేసిన భారత మహిళా జట్టులో బారెడ్డి అనూష (అనంతపురం), అంజలి శర్వాణి (కర్నూలు), ఎస్‌ మేఘన (విజయవాడ) ఉన్నారు. మూగ్గురూ కూడా ఏపీ నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఇంతమంది జాతీయ జట్టులో ఆడడం ఇదే మొదటిసారి. పురుషుల జట్టులో కూడా ముగ్గురు ప్లేయర్స్ ఒకేసారి ఆడిన దాఖలు లేవు. అనూష, అంజలి వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకోగా.. మేఘన కేవలం టీ20 ఫార్మాట్లో మాత్రమే ఆడనుంది.

టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), స్మాన్‌జోత్‌కీపర్ మేఘన, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, అంజలి సరవాణి, మోనికా పటేల్, రాశి కనౌజియా, అనూషా బారెడ్డి, మిన్ను మణి.

వన్డే జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్జ్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్, అమంజోత్), అమంజోత్ పునియా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, అంజలి సరవాణి, మోనికా పటేల్, రాశి రాశి కనౌజియా, అనూషా బారెడ్డి, స్నేహ రానా.

Also Read: UP Camel Attack: ప్రేమగా పెంచుకున్న ఒంటె.. యజమాని ప్రాణాలనే తీసేసింది!

 

Show comments