Bansuri Swaraj: తల్లి బాటలో కూతురు.. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏం చేసిందంటే..?
- పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యురాలిగా బన్సూరి స్వరాజ్ ప్రమాణ స్వీకారం
- సంస్కృతంలో ప్రమాణం చేసిన బన్సూరి
- 16వ లోక్‌సభలో తన తల్లి సంస్కృతంలో ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ బన్సూరి స్వరాజ్ సోమవారం పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్‌సభ తొలి సెషన్‌లో ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా.. బన్సూరి స్వరాజ్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో చప్పట్లతో పార్లమెంట్ ప్రతిధ్వనించింది. ఎందుకంటే బాన్సూరి స్వరాజ్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. బన్సూరి స్వరాజ్.. తన తల్లి బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సుష్మా స్వరాజ్ కూడా తొలిసారి ఎంపీ అయినప్పుడు.. ఆమె సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఆమె 16వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
Read Also: Lok sabha: తొలిరోజు సందడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా.. బన్సూరి స్వరాజ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రతినిధిగా ఈరోజు 18వ లోక్‌సభ పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత తనకు దక్కిందని ఆమె రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిభావంతులైన నాయకత్వంలో.. అభివృద్ధి చెందిన, సంపన్నమైన మరియు స్వావలంబన భారతదేశం సంకల్పాన్ని నెరవేర్చడానికి మనమందరం కట్టుబడి ఉన్నామని తెలిపింది.
Read Also: AP Assembly budget Session: వచ్చే నెలలో ఏపీ బడ్జెట్ సమావేశాలు..
బన్సూరి స్వరాజ్ ఎంపీగా తొలిసారి పార్లమెంటుకు వచ్చారు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి సోమనాథ్ భారతిపై గెలిచారు. బన్సూరి స్వరాజ్‌కు 4,53,185 ఓట్లు వచ్చాయి. సోమనాథ్ భారతికి 3,74,815 ఓట్లు వచ్చాయి. తద్వారా బన్సూరి 78,370 తేడాతో ఆప్ అభ్యర్థిని ఓడించారు.
नई दिल्ली लोकसभा क्षेत्र के प्रतिनिधि के रूप में आज 18वीं लोकसभा के संसद सदस्य के रूप में शपथ ग्रहण करने का गौरव प्राप्त हुआ।
यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी के प्रतिभाशाली नेतृत्व में हम सब विकसित, समृद्ध और आत्मनिर्भर भारत के संकल्प को पूर्ण करने के लिए प्रतिबद्ध… pic.twitter.com/YiPWWsq9Sn
— Bansuri Swaraj (@BansuriSwaraj) June 24, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!