NTV Telugu Site icon

Bansuri Swaraj: తల్లి బాటలో కూతురు.. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏం చేసిందంటే..?

Bansuri

Bansuri

దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ బన్సూరి స్వరాజ్ సోమవారం పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్‌సభ తొలి సెషన్‌లో ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా.. బన్సూరి స్వరాజ్‌ ప్రమాణస్వీకారం చేసే సమయంలో చప్పట్లతో పార్లమెంట్ ప్రతిధ్వనించింది. ఎందుకంటే బాన్సూరి స్వరాజ్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. బన్సూరి స్వరాజ్.. తన తల్లి బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సుష్మా స్వరాజ్ కూడా తొలిసారి ఎంపీ అయినప్పుడు.. ఆమె సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఆమె 16వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

Read Also: Lok sabha: తొలిరోజు సందడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు

కాగా.. బన్సూరి స్వరాజ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రతినిధిగా ఈరోజు 18వ లోక్‌సభ పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత తనకు దక్కిందని ఆమె రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిభావంతులైన నాయకత్వంలో.. అభివృద్ధి చెందిన, సంపన్నమైన మరియు స్వావలంబన భారతదేశం సంకల్పాన్ని నెరవేర్చడానికి మనమందరం కట్టుబడి ఉన్నామని తెలిపింది.

Read Also: AP Assembly budget Session: వచ్చే నెలలో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..

బన్సూరి స్వరాజ్ ఎంపీగా తొలిసారి పార్లమెంటుకు వచ్చారు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి సోమనాథ్ భారతిపై గెలిచారు. బన్సూరి స్వరాజ్‌కు 4,53,185 ఓట్లు వచ్చాయి. సోమనాథ్ భారతికి 3,74,815 ఓట్లు వచ్చాయి. తద్వారా బన్సూరి 78,370 తేడాతో ఆప్ అభ్యర్థిని ఓడించారు.