Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bank Scam %e0%b0%8f%e0%b0%82 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be %e0%b0%a8%e0%b0%be%e0%b0%af%e0%b0%a8%e0%b0%be %e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82

Bank Scam: ఏం తెలివిరా నాయనా.. బ్యాంక్‌నే బురిడీ కొట్టించారుగా..

Published Date :April 3, 2026 , 3:20 pm
By Burugadda Veerababu
Bank Scam: ఏం తెలివిరా నాయనా.. బ్యాంక్‌నే బురిడీ కొట్టించారుగా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఖమ్మం జిల్లా ఏన్కూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) లో జరిగిన భారీ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కంచే చేను మేసిన చందంగా.. తాకట్టు పెట్టే బంగారాన్ని పరీక్షించి ధ్రువీకరించాల్సిన గోల్డ్ అప్రైజరే స్వయంగా నకిలీ నగలతో బ్యాంకును బురిడీ కొట్టించాడు.

కుట్ర ఎలా సాగిందంటే..?
ఈ కేసుకు సంబంధించి ఏన్కూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపాది సతీష్ (A1) అనే వ్యక్తి ఈ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. తన హోదాను అడ్డం పెట్టుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కా పథకం వేశాడు. తన భార్య శ్రీపాది మౌనిక (A2), అత్త రామచంద్రోజు జయమ్మ (A3), బావమరిది రామచంద్రోజు నరేశ్‌ (A4) లతో కలిసి 2024లో విడతల వారీగా సుమారు 242.25 గ్రాముల నకిలీ ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టించాడు. సతీష్ స్వయంగా వాటిని అసలైన బంగారంగా సర్టిఫై చేయడంతో, బ్యాంక్ అధికారులు ఏమాత్రం అనుమానించకుండా నిందితులకు రూ. 9.53 లక్షల గోల్డ్ లోన్ మంజూరు చేశారు.

మోసం బయటపడిందిలా..

రుణం తీసుకున్న నిందితులు గడువు ముగిసినా అసలు కానీ, వడ్డీ కానీ చెల్లించలేదు. దీంతో ఆ లోన్ అకౌంట్లు అన్నీ ఎన్‌పీఏ (NPA – నిరర్థక ఆస్తులు) గా మారిపోయాయి. బ్యాంకు నిబంధనల ప్రకారం బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు ఆ ఆభరణాలను వేలం వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వేలం ప్రక్రియలో భాగంగా ఇతర నిపుణులతో బంగారాన్ని పునఃపరిశీలించగా, అవి కేవలం బంగారు పూత పూసిన నకిలీ నగలుగా తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.

ముగ్గురి అరెస్ట్ ..

బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కేవీ ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఏన్కూరు ఎస్సై సంధ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురూ కలిసి పథకం ప్రకారం బ్యాంకును మోసం చేసినట్లు నిర్ధారించారు.

నిందితులైన సతీష్ (గోల్డ్ అప్రైజర్), జయమ్మ, నరేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సతీష్ భార్య మౌనిక (A2) ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినా.. నకిలీ పత్రాలు లేదా నకిలీ వస్తువులతో మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bank fraud Telangana
  • Enkoor police arrest
  • fake gold loan case
  • gold loan news
  • Kalluru ACP Vasundhara Yadav

తాజావార్తలు

  • Bank Scam: ఏం తెలివిరా నాయనా.. బ్యాంక్‌నే బురిడీ కొట్టించారుగా..

  • Tamil Nadu Assembly Elections 2026: బీజేపీ ఇలా చేసిందేంటి?.. అన్నామలైకి బిగ్ షాక్ ఇచ్చిన కమలం పార్టీ..

  • Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో వచ్చేస్తోంది.. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, యాక్టివ్ మ్యాట్రిక్స్ ఫీచర్

  • CM Chandrababu: తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు.. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను!

  • Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు

ట్రెండింగ్‌

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions