Site icon NTV Telugu

Bank Robbery: సూసైడ్‌ చేసుకుంటానంటూ 40 లక్షలు దోచుకెళ్లిన వ్యక్తి!

Bank Robbery

Bank Robbery

Bank Robbery: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకు శాఖకు వెళ్లి రూ.40 లక్షలు దోచుకెళ్లాడు. బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడుతూ.. తనకు రూ.38.5 లక్షల ఇంటి రుణం బాకీ ఉందని, తన ఆస్తిని వేలం వేయబోతున్నారని, దీంతో తన పిల్లలు నిరాశ్రయులవుతారని నిందితుడు చెప్పాడు. కాబట్టి నాకు రూ.40 లక్షలు ఇవ్వండి అంటూ.. నిందితుడు బ్యాంక్ మేనేజర్‌తో సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడి, అకస్మాత్తుగా తన వద్ద తుపాకీ ఉందని చెప్పాడు. ఆ తర్వాత.. తనకు రూ.40 లక్షలు ఇవ్వాలని, లేకుంటే బ్యాంకులో ఆత్మహత్య చేసుకుంటానని, లేదంటే బ్యాంకు మేనేజర్‌ని చంపేస్తానని బెదిరించాడు.

Mahalaya Amavasya 2024: నేడే మహాలయ అమావాస్య! ఎందుకు జరుపుకుంటారు? నవరాత్రులకు సంబంధం ఏమిటి?

దాంతో చేసేదేమి లేక.. అతడి ప్రాణాలను కాపాడేందుకు బ్యాంక్ మేనేజర్ క్యాషియర్‌ను పిలిచి రూ.40 లక్షలు నిందితుడికి ఇచ్చాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన జరిగిన సమయంలో బ్యాంకులో సుమారు 25 మంది ఉన్నారు. వారిలో 12 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ వీపుపై తుపాకీ పెట్టడంతో బ్యాంకు మేనేజర్, క్యాషియర్ బయటకు తీశారు.

Gandhi Jayanthi 2024: భారత కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?

ఈ ఘటనపై షామ్లీ ఎస్పీ రామ్‌సేవక్ గౌతమ్ మాట్లాడుతూ.. షామ్లీలోని ధిమన్‌ పురాలోని బ్యాంక్ ప్రధాన శాఖలో ఈ ఘటన జరిగిందని., బ్యాంక్ మేనేజర్ నమన్ జైన్ దొంగ దగ్గర తుపాకీ ఉందని గుర్తించలేకపోయాడు. అయితే, నిందితుడి వద్ద తుపాకీ ఉందని బ్యాంకు గార్డు పేర్కొన్నాడు. ఈ కేసుపై ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని.. వారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, బ్యాంకు ఉద్యోగులను విచారిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version