Site icon NTV Telugu

Bank Manager Fraud: 26 కిలోల బంగారంతో ఉడాయించిన బ్యాంకు మేనేజర్..

Gold

Gold

Bank Manager Fraud: కొత్తగా బ్యాంకుకు వచ్చిన మేనేజర్ ఫిర్యాదు మేరకు కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వడకర పోలీసులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మాజీ బ్రాంచ్ మేనేజర్‌ పై కేసు నమోదు చేశారు. కొత్త మేనేజర్ ఇర్షాద్ తాకట్టు పెట్టిన బంగారాన్ని చూసే సరికి ఏదో తప్పు జరిగినట్లు అక్కడ గుర్తించారు. తాకట్టు పెట్టిన బంగారంలో నకిలీ బంగారం బయటపడింది. తదుపరి విచారణలో పెద్ద కుంభకోణం జరిగిందని తేలడంతో ఇర్షాద్ పోలీసులను ఆశ్రయించాడు. తమిళనాడు వాసి మధు జయకుమార్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసి కొచ్చిలోని బ్రాంచ్‌కి బదిలీ అయ్యారు. బదిలీ అనంతరం ఇర్షాద్ బాధ్యతలు చేపట్టారు.

Medical Services: నేడు దేశవ్యాప్తంగా వైద్యసేవలు బంద్..

ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత కూడా జయకుమార్ తన కొత్త పోస్టింగ్‌ కు రాలేదు. అప్పటికి ఇర్షాద్‌ కు తనఖా పెట్టిన బంగారంలో ఎన్నో తీవ్రమైన వైరుధ్యాలు కనుగొనబడ్డాయి. బ్యాంకులో తాకట్టు పెట్టిన 26 కిలోల బంగారంలో నకిలీ బంగారం ఉన్నట్లు విచారణలో తేలింది. దింతో బ్యాంకుకు దాదాపు రూ. 17 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయకుమార్‌ మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ లో ఉండడంతో అతని ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇంత పెద్ద మోసం ఒక్క వ్యక్తి ద్వారా ఎలా సాధ్యమైందని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వడకర శాఖలోని ఉద్యోగులందరి వాంగ్మూలాలను పోలీసులు త్వరలో నమోదు చేయనున్నారు.

Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్..

Exit mobile version