Site icon NTV Telugu

Bank Holidays: మార్చి నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదే!

Bank Holidays

Bank Holidays

Bank Holidays: బ్యాంక్‌ కస్టమర్లకు బ్యాంకుల్లో ఎప్పుడూ ఏదో పని ఉంటూనే ఉంటుంది. అందుకే బ్యాంకుల్లో ఏదైనా పని కోసం వెళ్లాలంటే.. ముందుగా బ్యాంక్ సెలవులపై అవగాహన ఉండాలి. బ్యాంక్ ఏరోజు పనిచేస్తుందో.. ఏరోజు సెలవు ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. 2024 సంవత్సరానికి సంబంధించి మార్చి నెల బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయడం జరిగింది. మార్చి నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిల్లో ప్రాంతీయ సెలవులు సహా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో ఛాప్‌ఛర్ కుట్ సహా మహాశివరాత్రి, హోలీ, గుడ్‌ఫ్రైడే వంటి పండగలు ఉన్నాయి. అయితే సెలవు దినాలలో బ్యాంకులు మూతపడినప్పటికీ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్ లైన్ సర్వీసులు మాత్రం యధావిధిగా పని చేస్తాయని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ సెలవు రోజుల్లో బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్స్ యధావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు వెల్లడించారు.

Read Also: Threat Calls: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడికి బెదిరింపు కాల్స్‌

మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

మార్చి 01 : చప్చర్ కుట్ (మిజోరాం)

మార్చి 03 : ఆదివారం

మార్చి 08 : మహాశివరాత్రి (దేశంలోని చాలా రాష్ట్రాలకు సెలవు)

మార్చి 09 : రెండవ శనివారం

మార్చి 10 : ఆదివారం

మార్చి 17 : ఆదివారం

మార్చి 22 : బీహార్ దివస్ (బీహార్)

మార్చి 23 : నాలుగవ శనివారం

మార్చి 24 : ఆదివారం

మార్చి 25 : హోలీ (దేశంలోని చాలా రాష్ట్రాలకు సెలవు)

మార్చి 26 : హోలీ (ఒడిస్సా, మణిపూర్)

మార్చి 27 : హోలీ (బీహార్)

మార్చి 29 : గుడ్ ఫ్రైడే (దేశంలోని చాలా రాష్ట్రాలకు సెలవు)

Exit mobile version