NTV Telugu Site icon

Mumbai: భారత్ లోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు.. నకిలీ పత్రాలు సృష్టించి ఓటు సైతం వేసినట్లు గుర్తింపు

New Project (6)

New Project (6)

బంగ్లాదేశ్‌ నుంచి రహస్యంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ముంబై నుంచి షాకింగ్ విషయం బహిర్గతమైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నలుగురు యువకులు ఇక్కడ నివసించడమే కాకుండా.. వారు చట్టవిరుద్ధంగా భారత పౌరులుగా మారడానికి పత్రాలను కూడా పొందారు. అంతేకాకుండా.. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. అలాంటి నలుగురు విదేశీ పౌరులను ఏటీఎస్ అరెస్ట్ చేసింది.

READ MORE: Odisha: ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ..

మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ (Anti Terrorism Squad) ముంబై లో నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసింది. నలుగురు బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించింది. ముంబైలో అక్రమంగా నివసిస్తున్నారు. ఈ వ్యక్తులు ఇక్కడ కూడా నకిలీ పత్రాలు తయారు చేసి, ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటు వేశాసినట్లు గుర్తించారు. వీరితో పాటు ఇంకో అయిదుగురు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వాళ్లు పరారీలో ఉన్నారు. అతని కోసం ఏటీఎస్ వెతుకుతోంది.

1. రియాజ్ హుస్సేన్ షేక్, వయస్సు 33,
2. సుల్తాన్ సిద్ధిఖీ షేక్, వయస్సు 54,
3. ఇబ్రహీం షఫివుల్లా వయస్సు 46.
4. ఫరూక్ ఉస్మాంగాని షేక్ వయస్సు 39.
ఈ నలుగురు నిందితులను ఏటీఎస్ మజ్‌గావ్ కోర్టులో హాజరుపరిచింది. ముగ్గురు నిందితులను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అదే సమయంలో, ఒక నిందితుడు ఫరూక్ షేక్‌ను జూన్ 14 వరకు ATS కస్టడీకి పంపారు. పరారీలో ఉన్న ఇతర విదేశీ పౌరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీంతోపాటు పరారీలో ఉన్న విదేశీయులను అరెస్టు చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

Show comments