NTV Telugu Site icon

Odisha Govt: బంగ్లాదేశీయులు సముద్రం గుండా భారత్‌లోకి ప్రవేశించడంపై ఒడిశా ప్రభుత్వం క్లారిటీ..

Odisha

Odisha

బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం, హిందువులపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో.. హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. సరిహద్దుల్లో వేలాది మంది హిందువులను భద్రతా అధికారులు అడ్డుకున్నారు. మరోవైపు.. బంగ్లాదేశీయులు సముద్ర మార్గం ద్వారా ఇండియాలోకి ప్రవేశించవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ఎలాంటి నివేదిక అందలేదన్నారు.

Read Also: Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించిట్లే..

ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని హరిచందన్ తెలిపారు. బంగ్లాదేశ్‌తో 480 కి.మీ పొడవైన సముద్ర సరిహద్దు వెంబడి ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్.. ఒడిశా మెరైన్ పోలీసులు మూడంచెల భద్రతను నిర్వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం మధ్య సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు ఒడిశాలోకి ప్రవేశించే అవకాశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు హరిచందన్ స్పందిస్తూ.. అలాంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కోస్ట్ గార్డ్, ఒడిశా మెరైన్ పోలీసులను ఆదేశించారన్నారు. అంతేకాకుండా.. బీచ్‌లో పెట్రోలింగ్‌కు ఆదేశించినట్లు తెలిపారు.

Read Also: Rishabh Pant: భారత క్రికెట్ అభిమానుల వల్లే ఆ బంతి సిక్స్ వెళ్లలేదు.. టీ20 ప్రపంచకప్‌పై పంత్!

కొందరు బంగ్లాదేశీయులు ఒడిశాలో చాలా కాలంగా నివసిస్తున్నారని హరిచందన్ చెప్పారు. వీసా, వర్క్ పర్మిట్ ఉంటేనే రాష్ట్రంలో ఉండటానికి ప్రభుత్వం ధృవీకరిస్తుందన్నారు. ధృవీకరణ తర్వాత, అక్రమ చొరబాటుదారులను పంపుతామని తెలిపారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఒడిశాలోని ఏడు జిల్లాల్లో మొత్తం 3,740 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించారు. వీరిలో కేంద్రపారాలో 1,649 మంది, జగత్‌సింగ్‌పూర్‌లో 1,112 మంది, మల్కన్‌గిరిలో 655 మంది అక్రమంగా నివసిస్తున్నారు.