NTV Telugu Site icon

IPL 2023 : ఐపీఎల్ 2024లో బంగ్లా, శ్రీలంక ప్లేయర్స్ పై నిషేదం..? బీసీబీ చర్యలతో అసంతృప్తిలో బీసీసీఐ

Ipl

Ipl

ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు కొన్ని చర్యలు బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలక నచ్చడం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు దేశాల ఆటగాళ్లను ఐపీఎల్ 2024లో నిషేదించవచ్చని తెలుస్తోంది. వచ్చే సీజన్ లో రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సిరీస్ లను ఐపీఎల్ సమయంలోనే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఐపీఎల్ జట్టులో భాగమైన చాలా మంది ఆటగాళ్లు కొన్ని రోజుల పాటు ఫ్రాంఛైజీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఐపీఎల్ 2023లో షక్ీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ముస్తాఫిజుర్ రెహమాన్ లతో సహా ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటారు. ముగ్గురు ఆటగాళ్లు తమ సంబంధిత ఐపీఎల్ జట్లకు ఏప్రిల్ 9 నుంచి యమే 5 వరకు.. మళ్లీ మే 15 నుంచి అందుబాటులో ఉంటారు.

Also Read : Nedurumalli RamkumarReddy: ఆనం బాధంతా మంత్రి పదవి ఇవ్వలేదనే..

ఇది కాకుండా నలుగురు శ్రీలంక ఆటగాళ్లలో ముగ్గురు ఏప్రిల్ 8 తర్వాత మాత్రమే ఐపీఎల్ కి అందుబాటులో ఉంటారు. ఇందులో వాణిందు హసరంగ, మతిషా పతిరన, మహేష్ తీక్షణ ఉన్నారు. ఏప్రిల్ 8 వరకు శ్రీలంక-న్యూజిలాండ్ పర్యలనలో ఉండనుంది. ఒక ఫ్రాంఛైజీ అధికారి ఇన్ సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ఇతర బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నందున మేం ఫిర్యాదు చేయలేం.. ఫ్రాంఛైజీలు కొన్ని దేశాల నుంచి ఆటగాళ్లను ఎంచుకోవడానికి వెనుకాడుతుంది. తస్కిన్ అహ్మద్ ఎన్ఓసీ పొందలేదు.. ఇప్పుడు ఇలాంటి వార్త వచ్చింది. వారు తమ ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడించకూడదంటే.. వారు నమోదు చేసుకోకూడదు.. సహజంగానే బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆలోచన భవిష్యత్ లో మారుతుంది అని తెలిపాడు.

Also Read : Papaya Seeds : పండు తిని గింజలని పారేస్తే పొరపాటే

ఈ సమస్య గురించి నన్ను పదేపదే అడిగారు అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పాపోన్ పేర్కొన్నాడు. నేను అదే సమాధానం ఇచ్చాను.. ఐపీఎల్ వేలానికి పిలిచే ముందు.. ఐపీఎల్ అధికారులు ఆటగాళ్ల లభ్యత గురించి మమ్మల్ని అడిగారు.. మేం వారికి షెడ్యూ్ల్ ఇచ్చాం.. ఈ విషయం తెలుసుకున్న ఆయన వేలానికి ముందుకొచ్చారు.. అతను బంగ్లాదేశ్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండకుండా ఉండే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను.. అలాంటప్పుడు కాస్త డౌట్ వస్తుందేమో ఆలోచించుకోమని చెప్పాం.. మేం దానిని క్లియర్ చేశాం.. నిజం చెప్పాలంటే మనసు మార్చుకునే అవకాశం నాకు కనిపంచిండం లేదు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు.

Also Read : Team India : ఆమిర్ ఖాన్ ను ట్రోల్ చేసిన రోహిత్ సేన

తమ బోర్డుని ఒప్పించడం ఆటగాళ్లపైనే ఉంటుందని ఇన్ సైడ్ స్పోర్ట్స్ తో బీసీసీఐ సీనియర్ అధికారి అన్నారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇతర ప్రధాన బోర్డులు దీని కోసం మార్గాలను రూపొందించాయి. ఐపీఎల్ ప్రజాదరణను ఎవరూ కాదనలేరు. ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా బోర్డు కూడా వారి వాటాను పొందుతుంది. కానీ, వారు వేరే నిర్ణయం తీసుకుంటే.. అది వారిపై ఉంటుంది. అంటూ చెప్పకొచ్చాడు.