NTV Telugu Site icon

Durgama Idols Destroyed: ఘోరం.. దుర్గామాత విగ్రహాలు ధ్వంసం.. ఎక్కడంటే?

Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్‌కు మహ్మద్ యూనస్ నాయకత్వం వహించినప్పటి నుంచి పలు మార్లు హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. ఇటీవల వరదలకు భారత్ కారణమని నిందించినట్లు సమాచారం. ఇప్పుడు దుర్గాపూజను జరుపుకోవడానికి అనుమతించకపోవడం… ఇవన్నీ బంగ్లాదేశ్ కృతజ్ఞతలేనితనానికి ఉదాహరణలు. నేటి నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. కానీ బంగ్లాదేశ్ ఇప్పటికీ దుర్గాపూజ జరుపుకోవడానికి అనుమతించడం లేదు. బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ విషయంలో దుమారం రేపుతోంది.

READ MORE: Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. భక్తులకు ఈవో కీలక సూచనలు

దుర్గాపూజకు హిందువులకు అనుమతి ఇవ్వడానికి దేశంలోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం, ముస్లిం సంస్థలు నిరాకరించాయి. భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, దాడి జరిగే ప్రమాదం ఉందన్నది వారి వాదన. అదే సమయంలో.. అనుమతి పొందిన పూజా కమిటీలు నమాజ్ సమయంలో శాంతిని కాపాడాలని కోరారు. అంటే నమాజ్ సమయంలో పూజలు, భజనలు ఆపేయాలని ఆదేశించారు. ఇదే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి దుర్గా విగ్రహాలు ధ్వంసమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున కిషోర్‌గంజ్‌లోని బట్రిష్ గోపీనాథ్ జియుర్ అఖారాలో దుర్గామాత యొక్క సరికొత్త విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని కొమిల్లా జిల్లాలో ఓ ఆలయంలో కూడా దుర్గా మాత విగ్రహాన్ని పగులగొట్టి ఆలయంలోని విరాళాల పెట్టెను దోచుకెళ్లారు. రెండు రోజుల క్రితం నారాయణ్ జిల్లాలోని మిరపరాలోని దుర్గా గుడిపై ఛాందసవాదులు దాడి చేశారు.

READ MORE:Kia Carnival 2024 Price: ‘కియా కార్నివాల్’ లాంచ్.. ఇట్స్ వెరీ కాస్ట్‌లీ! ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే

ఇదిలాఉండగా.. అక్టోబర్ 9 నుంచి ప్రారంభమయ్యే దుర్గాపూజకు ముందు ‘జిజ్యా’ పన్నుగా పూజా పండల్‌కు రూ. 5 లక్షలు చెల్లించాలని పూజా కమిటీలను లిఖితపూర్వకంగా కోరినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. జిజ్యా పన్ను కారణంగా, పూజను నిర్వహించకూడదని ఇప్పటికే పెద్ద సంఖ్యలో కమిటీలు నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. యూనస్ ప్రభుత్వం బుధవారం భారతదేశంలో పోస్ట్ చేసిన వారితో సహా ఐదుగురు రాయబారులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో ఈ సంఘటనలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. బ్రస్సెల్స్, కాన్‌బెర్రా, లిస్బన్, న్యూఢిల్లీ, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్‌లో నియమించబడిన రాయబారులను ఢాకాకు తిరిగి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగా భారత్‌తో చెలగాటమాడుతోంది.