Bangladesh Elections 2026: బంగ్లాదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బంగ్లాదేశ్ 13వ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త మార్పులకు తెరలేపాయి. అధికార సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో జాతీయవాద పార్టీగా గుర్తింపు పొందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) భారీ ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్లింది. ఆ పార్టీ 211 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ (Bangladesh Jamaat-e-Islami) 68 స్థానాల్లో గెలుపొందింది. ఈ తరుణంలో అక్కడున్న మైనారిటీల అంశం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో హిందూ సమాజానికి చెందిన నలుగురు అభ్యర్థులు గెలవడం ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది. మొత్తం ఫలితాల్లో ఇది చిన్న సంఖ్యలా కనిపించినా, దాని వెనుక ఉన్న అర్థం మాత్రం పెద్దదే అంటున్నారు నిపుణులు.
READ MORE: Trump: ఇరాన్‌లో పాలన మార్పు తథ్యం.. డీల్ కుదరకపోతే జరిగేది అదేనన్న ట్రంప్
ఢాకా ప్రాంతంలో సీనియర్ నాయకుడు గయేశ్వర చంద్ర రాయ్ విజయం సాధించారు. ఆయన సుమారు 99 వేలకుపైగా ఓట్లు సాధించి తన ప్రత్యర్థిని వెనక్కి నెట్టారు. ఇటీవలి కాలంలో హిందూ సమాజంపై దాడులు, ఒత్తిళ్ల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన గెలుపు ప్రతీకాత్మకంగా ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పోటీ కఠినంగా ఉన్నప్పటికీ ఆయన స్పష్టమైన ఆధిక్యంతో గెలవడం గమనార్హం. మగురా ప్రాంతంలో నితాయ్ రాయ్ చౌదరి (Nitai Roy Chowdhury) మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 1 లక్ష 47 వేలకుపైగా ఓట్లు లభించాయి. ఆయన గెలుపుతో ఆ ప్రాంతంలో పార్టీ బలం మరింత పెరిగిందని భావిస్తున్నారు. రంగమాటి నుంచి న్యాయవాది దీపెన్ దేవాన్ మూడో విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం సాధించి పార్లమెంట్‌లో చోటు దక్కించుకున్నారు. అలాగే బందర్బన్ ప్రాంతం నుంచి సాచింగ్ ప్రూ కూడా 1 లక్ష 41 వేలకుపైగా ఓట్లతో గెలిచారు. ఈ విధంగా ఈ పార్టీ తరఫున మొత్తం నలుగురు మైనారిటీ ప్రతినిధులు పార్లమెంట్‌లోకి వెళ్లారు.
READ MORE: Pulwama Attack: పుల్వామా దాడిపై ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ సంచలన ప్రకటనతో.. భారతీయుడి రక్తం మరిగింది!
https://www.yourwebsite.com/
