Bangladesh: బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ కోసం రూ.4 కోట్లు కేటాయించిన మహ్మద్ యూనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం నడుస్తోంది. బుధవారం మహ్మద్ యూనస్ మాట్లాడుతూ భారత ప్రభుత్వంతో తమ ప్రభుత్వం సత్సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. కానీ ఈ సంబంధం సమానత్వం, న్యాయబద్ధత ఆధారంగా ఉండాలి. కాగా, బంగ్లాదేశ్‌లోని దుర్గాపూజ కమిటీలకు మహ్మద్ యూనస్ ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించింది. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు డాక్టర్ ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ భారత్‌తో సహా ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటుందని, అయితే అది సమానత్వం, న్యాయబద్ధత ఆధారంగా ఉండాలని అన్నారు. పరిపాలనా సారథిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు దేశాల నేతలు, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని మహ్మద్ యూనస్ తెలిపారు.
Read Also:Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాది నాల్గోసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత..
Also Read
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఉద్యమం తరువాత, షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందారు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. వరదలను ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్‌తో భారత్‌తో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించినట్లు మహ్మద్ యూనస్ తెలిపారు. దక్షిణాసియాలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు సార్క్‌ను పునరుద్ధరించే ప్రయత్నాన్ని ఆయన ప్రారంభించారు. సార్క్‌లో భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ పూజ సమయంలో శాంతిభద్రతలను ఎలా నిర్వహించాలో.. భద్రతను ఎలా పెంచాలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆర్థికంగా వెనుకబడిన ఆలయ కమిటీలకు ఈసారి ముఖ్య సలహాదారు నిధి నుంచి రూ.4 కోట్లకు పెంచినట్లు హోం వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి తెలిపారు. గతంలో కేటాయించిన దానికంటే ఇది దాదాపు రెట్టింపు అని తెలిపారు. పూజ వద్ద భద్రత కోసం తాత్కాలిక ప్రాతిపదికన వాలంటీర్లను నియమిస్తామని హోం సలహాదారు తెలిపారు. పూజా రోజుల్లో మైక్, ధాక్ లేదా ఇతర సంగీత వాయిద్యాల వినియోగాన్ని ఆజాన్‌కు కనీసం ఐదు నిమిషాల ముందు నిలిపివేయాలని ఆయన అన్నారు. ఆజాన్ ముగిసిన తర్వాత దీన్ని మళ్లీ ప్రారంభించవచ్చు. ఈసారి బంగ్లాదేశ్‌లోని దుర్గాపూజ మండపాల సంఖ్య దాదాపు 32 వేల వరకు ఉండే అవకాశం ఉంది. శాంతిభద్రతలు ఏ విధంగానూ క్షీణించకుండా చూసేందుకు పోలీసులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చామని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది.
Read Also:IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో ఈ రికార్డ్స్ బద్దలు కానున్నాయా..?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!