బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక ప్రభుత్వం శనివారం ఒక పెద్ద అడుగు వేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం ప్రకటించింది. ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఈ నిషేధం విధించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో అవామీ లీగ్, దాని నాయకులపై జరుగుతున్న విచారణ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయాన్ని సలహా మండలి (క్యాబినెట్) సమావేశంలో ఆమోదించారు.
READ MORE: Ceasefire Violation: మేము కాల్పుల విరమణను ఉల్లంఘించలేదు: పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
జూలై 2024లో తిరుగుబాటు తర్వాత దేశం అస్థిరత ఎదుర్కొంటున్న సమయంలో అవామీ లీగ్‌పై ఈ చర్య తీసుకున్నారు. కాగా.. గతేడాది రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన నిరసన ఉద్యమం షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత నిరసనగా మారింది. ప్రభుత్వం, నిరసనకారుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చెలరేగాయి. ఆ తర్వాత అశాంతి మరింత తీవ్రమైంది. ఈ నిరసనల తర్వాత అప్పటి ప్రధాన మంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. ఆమె ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇంతలో, యూనస్ ప్రభుత్వం షేక్ హసీనా పార్టీ మద్దతుదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. షేక్ హసీనా, గతంలో పని చేసిన ఆమె మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
READ MORE: Ajit Doval: పాక్- భారత్ వివాదం.. అజిత్ దోవల్‌తో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి!
