NTV Telugu Site icon

Bengaluru rave party: బెంగుళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట

Actress Hema Event

Actress Hema Event

Bengaluru rave party: బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉంది. అయితే, ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. ఈ మేరకు పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాల మేరకు నటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలనే నిర్ణయాన్ని కమిటీ ఆమోదించింది.

Read Also:Akash Deep: సిడ్నీ టెస్టు నుండి టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవుట్..

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెను రిమాండ్ చేసింది. ఇటీవల ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MA) హేమను సస్పెండ్ చేసింది. అయితే, తాను డ్రగ్స్ తీసుకోలేదని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఆమెను సస్పెండ్ చేయడం సరైనది కాదని హేమ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొంటూ నివేదికలను కూడా ఆమె సమర్పించింది. హేమ ఆధారాలను పరిశీలించిన తర్వాత, ఆమెపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు మా కార్యనిర్వాహక కమిటీ ప్రకటించింది.

Read Also:Game Changer : ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ పై సెన్సార్ బోర్డు ఏమన్నదంటే ?

Show comments