Site icon NTV Telugu

Bandlaguda Tragedy: బండ్లగూడలో విషాదం.. కరెంట్ షాక్‌తో ధోనీ మృతి!

Dhoni Dead

Dhoni Dead

Bandlaguda Electric Shock Accident: చాంద్రాయణగుట్ట బండ్లగూడలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీలు మృతి చెందారు. చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్‌కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా యువకులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. ముగ్గురిలో ఓ యువకుడికి పెద్దగా గాయాలు కాలేదు. గాయపడ్డ ఇద్దరు యువకులను చికిత్స నిమ్మితం చాంద్రాయణగుట్టలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. చాంద్రాయణగుట్ట-బండ్లగూడ మెయిన్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో 2025 శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి 5 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Also Read: Asia Cup 2025: నేడు భారత జట్టు ఎంపిక.. గిల్, శ్రేయస్‌, సిరాజ్‌ డౌటే? అవకాశం ఎవరికో!

మృతుడు ధోనీ సోదరుడు, ప్రత్యక్ష సాక్షి బన్నీ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘చనిపోయిన మా సోదరుడు ధోనీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తాడు. రాత్రి 11 గంటలకు గణేష్ విగ్రహాన్ని తీసుకురావాలని మేము అందరం చాంద్రాయణగుట్ట నుంచి జలపల్లి వెళ్లాము. జెల్ పల్లిలో గణేష్ విగ్రహం తీసుకొని చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్‌ వెళుతున్నాం. రాత్రి 12 తరువాత చాంద్రాయణగుట్ట-బండ్లగూడ రోడ్డు రాగానే విద్యుత్ తీగలు తగిలాయి. మా అన్నయ్య ధోనీ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నాడు. వికాస్ అనే మరో యువకుడు వెనక ఉన్నాడు. నాతో పాటు మరో ఫ్రెండ్ అఖిల్, త్యాగి ఉన్నాడు. కరెంట్ షాక్ తగలగానే ట్రాక్టర్ వెనుక టైర్లు ధోనీ మీది నుంచి వెళ్లాయి. అన్నయ్య అక్కడిక్కడే చనిపోయాడు. కరెంట్ షాక్ తగలగానే నేను ట్రాక్టర్ నుంచి కిందికి దూకేశాను, నాకు వెనక గాయాలయ్యాయి. ధోనీ, రాకేష్, నేను ముగ్గురం సోదరులం. మృతదేహాలు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. గాయపడ్డ మరో ఇద్దరూ ఫ్రెండ్స్ ఓవైసీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు’ అని బన్నీ తెలిపాడు.

Exit mobile version