NTV Telugu Site icon

Bandla Ganesh : గురూజీ పై మరోసారి మండిపడిన బండ్ల గణేష్…

Whatsapp Image 2023 06 21 At 3.28.33 Pm

Whatsapp Image 2023 06 21 At 3.28.33 Pm

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణ గారు పుట్టినరోజు కానుకగా ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకు పూర్తైనట్లు తెలుస్తుంది.. జులై నుంచి కొత్త షెడ్యూల్ ను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.ఈ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర దర్శకుడు మరియు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

ఈ సినిమా కు సంబంధించి సంగీత దర్శకుడు థమన్ మరియు హీరోయిన్ పూజా హెగ్డేను మూవీ యూనిట్ తప్పించినట్లు సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే థమన్ సోషల్ మీడియాలో సెటైరికల్ గా స్పందిస్తూ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. దీంతో ఇవన్నీ కూడా పుకార్లే అని తెలుస్తుంది.. అయితే ఒకేసారి హీరోయిన్ ను మరియు సంగీత దర్శకుడిని మూవీ నుంచి తప్పించడం ఏంటని ఫ్యాన్స్ కూడా గందరగోళానికి గురవుతున్నారు.ఈ విషయంలో ప్రముఖ నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇన్ డైరెక్ట్ గా ఆయన దర్శకుడు త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ సినిమా ఉందా లేదా దాన్ని కూడా ఎక్కించేశావా అంటూ కామెంట్స్ చేసారు.. తాజాగా బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది.. బండ్ల గణేష్ పై మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. బండ్ల గణేష్ ఇంతకు ముందు కూడా కూడా గురూజీ పై తీవ్రంగా మండిపడ్డాడు. ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు త్రివిక్రమ్ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి.

Show comments