NTV Telugu Site icon

Bandla Ganesh: కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత బండ్ల గణేష్.. ఆయన రియాక్షన్‌ ఇదే..

Bandla Ganesh

Bandla Ganesh

Bandla Ganesh: ప్రముఖ నటుడు, టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేశ్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగుతున్నట్లు.. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపిందని, ఆయన కూడా అందుకు ఓకే చెప్పారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్‌ ఎక్స్‌(ఒకప్పుడు ట్విట్టర్) వేదికగా స్పందించారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. తాను కాంగ్రెస్ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి తనకు అవకాశం ఇస్తానని చెప్పారు కానీ, ఈసారి టికెట్ వద్దని బండ్ల గణేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యమని.. దానికోసం పనిచేస్తానని వెల్లడించారు. తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదన్నారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే తన ధ్యేయమని.. తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామన్న బండ్ల అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Bhagavanth Kesari Trailer: బాలయ్య కోసం కదిలొస్తున్న మాస్ డైరెక్టర్స్…

‘‘నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు.’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన గత ఎన్నికల్లో బండ్ల గణేష్ కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఇచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో ఆ పార్టీ తరఫున మాట్లాడారు. ఈ క్రమంలోనే కొన్ని ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈసారి కూకట్‌పల్లి టికెట్ బండ్ల గణేష్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తోందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.

మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.