NTV Telugu Site icon

Bandi Sanjay: ఫస్ట్ కు జీతాలు ఇవ్వలేరు కానీ.. మళ్లీ అధికారిమా..! కేసీఆర్ పై బండి ఫైర్

Bandi Sanjay Cm Kcr

Bandi Sanjay Cm Kcr

Bandi Sanjay: ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లది కబ్జాల ఆరాటం…. తనది పేదల పోరాటం అన్నారు. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి అని కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మంత్రి గంగుల కమలాకర్‌ను టార్గెట్ చేశారు. అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల, పురమళ్ల నెంబర్ వన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బియ్యం టెండర్లలో రూ.1300 కోట్ల గోల్ మాల్ చేసిన గంగుల అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇంట్లో 5 గురికి పదవులున్నయ్ అని మండిపడ్డారు.

నిరుద్యోగులు ఏం పాపం చేశారు? ఇంటికో ఉద్యోగం ఏమైంది? అని ప్రశ్నించారు. ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు అంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్, ఫకీర్ పేటలో బండి సంజయ్ ప్రచారంలో మాట్లాడుతూ.. గంగుల కమలాకర్ కు 2 సార్లు అధికారమిస్తే భూములు కొల్లగొట్టిండు… గుట్టలనే ధ్వంసం చేసిండని మండిపడ్డారు. ఇప్పుడు పొరపాటున మళ్లీ గెలిపిస్తే ఈసారి ఏకంగా మీ ఇండ్లను కొట్టేయడం ఖాయమన్నారు. గంగుల తోపాటు కాంగ్రెస్ అభ్యర్ధి భూకబ్జాల పంచాయతీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ, నాది పేదల కోసం ఎంతకైనా తెగించే నైజమన్నారు. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోవాలని ప్రజలను కోరారు.

ముస్లిం ఓట్ల కోసం మసీదులకు వెళ్లి నమాజ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. హనుమాన్ చాలీసాను ఉత్సాహంగా చదివే ధైర్యం ఒవైసీకి ఉందా? ఖైదీ సంజయ్ అడిగాడు. బండి సంజయ్ ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు. అవినీతి, అక్రమాల కారణంగా ఆయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఖైదీ సంజయ్ డబ్బులు తీసుకున్నాడని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. మతం పేరుతో ఎంత రెచ్చగొట్టినా బీజేపీకి ఓట్లు పడవు. హిందుత్వ ఓటు బ్యాంకు కోసం బండి సంజయ్, సెక్యులర్ నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్న మంత్రి గంగుల ఎలా ఉంటారో చూడాలి. ఓటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇద్దరు నేతల మధ్య ఎన్నికల పోరు ఎంత రసవత్తరంగా ఉంటుందనే దానిపై కరీంనగర్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
World Largest Bell: ప్రపంచంలోనే అతి పెద్ద గంటను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి