Site icon NTV Telugu

Bandi Sanjay: సింహం సింగిల్‎గానే వస్తుంది.. ఎగిరేది బీజేపీ జెండానే

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ఏ సర్వేలు చూసినా ములుగులో ఎగిరేది బీజేపీ జెండానే అని స్పష్టంగా తెలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ములుగు జిల్లా పోలింగ్ బూత్ సమ్మేళన సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. సర్వేలన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని బండి సంజయ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయంటూ ఆరోపించారు.

Read Also: SRH vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్

చివరికి కేసీఆర్ సర్వే కూడా బీజేపీ దే విజయం అని తేల్చిందన్నారు. పాలించమని కేసీఆర్‎కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఉన్న పరిశ్రమలే మూతపడే స్థితికి తీసుకొచ్చాడన్నారు. కేసీఆర్ పరిశ్రమలు మూసివేయిస్తుంటే మోడీ రామగుండంలో మూతపడ్డ యూరియా ఫ్యాక్టరీని ఓపెన్ చేయించారన్నారు. కుర్చీ వేసుకుని కూర్చొని పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తా అన్నారు. గిరిజన బిడ్డ మొదటి సారి రాష్ట్రపతి అవుతుంటే అడ్డుకునే కుట్ర చేశారంటూ ఆరోపించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వేల కోట్లు కెసిఆర్ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చాయో తెలపాలన్నాడు. రెండు సార్లు కేసీఆర్ కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకువచ్చాడని, మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రం మరింతం దిగజారుతుందన్నారు.

Read Also: Rangareddy Crime: చేపల వేటకు వెళ్లి.. ఇద్దరు మృతి

మోదీ దేశాన్ని శక్తి వంతమైన దేశంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. కెసిఆర్ తెలంగాణలో బెంగాల్ తరహా పాలన సాగించేందుకు కుట్ర చేస్తున్నాడని బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి, కులానికి కొమ్ము కాయదు. అలాగని హిందూ సమాజానికి అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. మతచందస వాదులకు వ్యతిరేకమన్నారు. ఎక్కడ పచ్చ జెండాలు ఎగిరాయో అక్కడ కాషాయ జెండాలు ఎగరేసిన ఘనత బీజేపీ ది. రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్న సంజయ్.. రుణమాఫీ, నిరుద్యోగ భృతి వెంటనే క్లియర్ చేయాలన్నారు. గిరిజనుల అభివృద్ధి్కి ఎన్నికోట్లు ఖర్చు చేశారో కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version