Site icon NTV Telugu

Bandi Sanjay: ఇదంతా టైమ్ పాస్ కోసమే.. SIT విచారణపై నమ్మకం లేదు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణపై తన అనుమానాలను వ్యక్తం చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. “నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని SIT‌కి అందజేస్తాను. బాధ్యత గల పౌరుడిగా పిలిస్తే వెళ్తున్నాను. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, SIT మీద నాకు నమ్మకం లేదు” అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Lenovo Idea Tab: 11 అంగుళాల భారీ డిస్ప్లే, 4 సంవత్సరాల సెక్యూరిటీ పాచ్‌లతో లెనోవో ఐడియా ట్యాబ్ లాంచ్!

ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట నేను బయటపెట్టాను.. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నా ఫోన్‌ను ప్రతి క్షణం ట్యాప్ చేశారు. అంతేకాదు.. నా సిబ్బంది, నా కుటుంబ సభ్యులు, మా పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే నన్ను దెబ్బతీయడానికి అనేక కుట్రలు పన్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు.

Srushti Fertility Case: ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసులో కలకలం.. మరో ఇద్దరి వైద్యుల అరెస్టు!

అంతేకాకుండా.. ఆధారాలు ఉన్నా కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడమే SIT‌పై నమ్మకం లేకపోవడానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యానించారు. BRS, కాంగ్రెస్ పార్టీలు కలిసి డ్రామా చేస్తున్నాయి. ఇది టైమ్ పాస్ కోసమే అంటూ ఆయన ఆగ్రహించారు. ఇక SIT విచారణ అనంతరం మరిన్ని విషయాలను మీడియాతో పంచుకుంటానని ఆయన తెలిపారు.

Infinix GT 30 5G+: షోల్డర్ ట్రిగర్స్ గేమ్ కంట్రోల్స్, 7,79,000+ AnTuTu స్కోర్తో నేడు లాంచ్ కానున్న ఇన్ఫినిక్స్ GT 30 5G+

Exit mobile version